సారాంశం

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ ఈ రోజు ఉదయం మరణించారు. తమిళనాడు గవర్నర్‌గానూ ఆమె సేవలు అందించారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆమె మరణానికి సంతాపం తెలిపారు.
 

Fathima Beevi: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 96వ ఏట ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా సేవలు అందించారు.

ఆమె మరణానికి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సంతాపం తెలిపారు. ఫాతిమా బీవీ మరణం బాధాకరం అని వివరించారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్‌ జస్టిస్ బీవీ రికార్డు సృష్టించారు.

Also Read: Miracle: పసిఫిక్ పై నుంచి వెళ్లుతుండగా విమానం పైకొప్పు ఊడిపోయింది.. అనూహ్యంగా..! మిరాకిల్ స్టోరీ ఇదే

ఫాతిమా బీవీ ధీశాలి అని, ధైర్య సాహసాలతో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నారని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బలమైన సంకల్పం, సేవ చేయాలనే చిత్తశుద్ధితో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని ఆమె తన జీవిత విధానంతో వెల్లడించారని జార్జ్ తెలిపారు.