Asianet News TeluguAsianet News Telugu

Miracle: పసిఫిక్ పై నుంచి వెళ్లుతుండగా విమానం పైకొప్పు ఊడిపోయింది.. అనూహ్యంగా..! మిరాకిల్ స్టోరీ ఇదే

విమానం సుమారు 24 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నది. కిందికి చూస్తే పసిఫిక్ మహాసముద్రం. ఇంతలో పెద్ద శబ్దం. విమానం పైకప్పులో పెద్ద బొక్క పడింది. అది పెరుగుతూ వస్తున్నది. చాలా వరకు పైకప్పు ఊడిపోయింది. హఠాత్తుగా పెరిగిన ప్రెజర్‌తో ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్ గాల్లో కలిసిపోయింది. అందరూ సీటు బెల్టులు పెట్టుకున్నారు కాబట్టి ఆ కుర్చీలకు అతుక్కుని ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో ప్రాణాలు ఆ పసిఫిక్‌లో కలిసిపోతాయని అనుకున్నారు. కానీ, అప్పుడే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 

US flight lost roof mid air while going over pacific ocean, but landed safely in a miracle story kms
Author
First Published Nov 21, 2023, 11:54 PM IST

Miracle: విమానం సుమారు 24 వేల అడుగులో ఎత్తులో ఎగురుతున్నది. పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెళ్లుతున్నది. ఫ్లైట్‌లో పెద్ద శబ్దం. ఉన్నట్టుండి ప్రయాణికులందరిపైనా విపరీతమైన ప్రెజర్ పెరిగింది. అంతలోనే శబ్దాలతో విమానంపై కప్పున మీటర్ వెడల్పుతో పెద్ద బొక్క పడింది. పైలట్ క్యాబిన్ నుంచి మొదలు వెనుక వైపుగా దాని పైకొప్పు ఊడిపోతున్నది. ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న అటెండాంట్ ఒక్కసారిగా ఊడిపోయిన భాగం నుంచి గాల్లో కలిసిపోయింది. ప్రయాణికులంతా పైకప్పు ఊడిపోయి అతివేగంగా వచ్చే గాలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరికాసేపట్లో తమ మరణం ఖాయం అనే అందరూ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత అనూహ్య పరిణామాలు జరిగాయి. పైకప్పు ఊడిపోయినా ఆ ఫ్లైట్ సుమారు 13 నిమిషాలు ప్రయాణించి సేఫ్‌గా ల్యాండ్ అయింది. హార్రర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవడం మూలంగా గాల్లోకి ఎగిరిపోకుండా నియంత్రించుకోగలిగారు. వైమానిక చరిత్రలో షాకింగ్, మిరాకిల్ స్టోరీ గురించి మీకోసం..

అమెరికాకు చెందిన అలోహ ఎయిర్‌లైన్ ఫ్లైట్ 243 1988 ఏప్రిల్ 28వ తేదీన ఒక నలభై నిమిషాల ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ విమానంలో 89 మంది ప్రయాణికులు, మరో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఆ బోయింగ్ 737 గాల్లోకి ఎగిరింది. ఆ ట్విన్ ఇంజిన్ ఫ్లైట్.. క్యాబిన్ ప్రెజర్ కోల్పోయింది. ఆ ఫ్లైట్ పైకప్పు ఎక్కువ మొత్తంలో ఊడిపోయింది. దీంతో ఆ విమాన ఫ్యూస్‌లేజ్ చాలా వరకు ఓపెన్ అయిపోయింది. చాలా మంది ప్రయాణికులకు పైన కప్పు ఏమీ లేకుండా పోయింది.

ఫ్లైట్ అటెండాంట్ క్లారాబెల్లా లాన్సింగ్ అప్పుడు ప్రయాణికులకు సర్వ్ చేస్తున్నది. అంతలోనే పైకప్పు ఊడిపోయింది. ఫ్లైట్‌లోని వారంతా సీటు బెల్టు పెట్టుకుని ఉన్నారు. కానీ, ఆమె సర్వ్ చేస్తూ ఉన్నది. పైకప్పు ఊడిపోగానే ఆమె గాల్లోకి లేచిపోయింది. కిందేమో పసిఫిక్ మహాసముద్రం. అంతే.. ఆమె మరిక కనిపించలేదు. ఆ తర్వాత కూడా ఆమె మృతదేహం దొరకలేదు.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

తమ కళ్ల ముందే ఫ్లైట్ పైకప్పు ఊడిపోవడం ఫ్లైట్ అటెండాంట్ దారుణంగా గాల్లో కలిసిపోవడం చూసిన ప్రయాణికులకు పిచ్చెక్కినంత పనైంది. అరుపులు పెడబొబ్బలు. రెండు ఇంజిన్‌లలో ఓ ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. మరికొన్ని క్షణాల్లో తామూ ఆ పసిఫిక్ మహా సముద్రంలో కలిసిపోవడమే అనుకున్నారు. ఈ ఫ్లైట్‌ను పైలట్ ల్యాండ్ చేసేలోపే తమ ప్రాణాలు పోతాయని వణికిపోతున్నారు.

అప్పుడే మనం ఆలోచించనూ లేని పనిని ఆ పైలట్ చేశాడు. ఫ్లైట్ పైకప్పు ఊడిపోయాక కూడా దాన్ని 24 వేల అడుగుల ఎత్తు నుంచి మెల్లిగా, క్రమంగానే ఎత్తు తగ్గించగలిగాడు. ఆ సింగిల్ ఇంజిన్‌తో ఫ్లైట్‌ను కహులూయి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయగలిగాడు.  ఫస్ట్ ఆఫీసర్ నుంచి పైలట్ కంట్రోల్స్ తీసుకుని ఎమర్జెన్సీ డెసెంట్ చేశాడు. పైకప్పు లేకుండా 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సేఫ్‌గానే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది.

ఇక గ్రౌండ్ పై నుంచి ఆ విమానం దిగడాన్ని చూస్తున్న ఎమర్జెన్సీ సిబ్బంది తమ కళ్లను నమ్మలేకపోయారు. పైకప్పు లేకుండా మంటలతో దిగుతున్న ఆ ఫ్లైట్‌ను చూడటాన్ని విశ్వసించలేకపోయారు.

ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేన్ ల్యాండ్ అయింది. ఎయిర్ హోస్టెస్ క్లారాబెల్లా లాన్సింగ్ తప్పితే ప్రతి ఒక్కరూ సురక్షితంగానే దిగిపోయారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read: కేసీఆర్‌పై అత్యధిక నామినేషన్లు.. అసలైన సవాల్ ఏమిటీ? ఒక్క ఈవీఎం ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగించవచ్చు?

ఆ విమానంలో డికంప్రెషన్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్లే ప్రమాదం సంభవించిందని యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తేల్చింది. వాటి వల్లే ఎడమ వైపు ఇంజిన్ ఫెయిల్ అయిందని వివరించారు. వాస్తవానికి ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడే ఓ ప్రయాణికుడు పైకప్పుకు ఉన్న క్రాక్‌ను చూశారట. కానీ, సిబ్బంది దృష్టికి దాన్ని తీసుకపోలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

ఆ విమానంలో వెనుకవైపున కూర్చున్న ప్రయాణికుడు ఎరిక్ బెక్లిన్ భయానకమైన ఆ దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటూ కంపించిపోయాడు. ‘ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఓ పేలుడు. వెంటనే బాగా ప్రెజర్ ప్రయాణికులపై పడింది. ఆ తర్వాత చూస్తే నా ముందు వైపున ఫ్లైట్ పైభాగం ఊడిపోతున్నది. పైకప్పు ముక్కలు ముక్కలుగా ఎగిరిపోతున్నది. ముందుగా సుమారు ఒక మీటర్ వెడల్పుతో పెద్ద బొక్క పడింది. ఆ తర్వాత అది పెద్దదవుతూ వచ్చింది’ అని ఎరిక్ చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios