త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం.. జాతీయ జెండాతో చికెన్ శుభ్రం.. వీడియో వైరల్, నెటిజన్ల ఫైర్..
ఇటీవల జాతీయ జెండాలను అవమానిస్తూ.. తమ సొంత పనులకు వినియోగిస్తున్న ఘటనలు అధికం అయ్యాయి. కొంత కాలం కిందట యూపీలో ఓ ముస్లిం వ్యాపారి పుచ్చకాయలపై పడిన దుమ్ము దులిపేందుకు త్రివర్ణ పతాకాన్ని వాడిన సంగతి ఇంకా మర్చిపోకముందే దాద్రా నగర్ హవేలీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మన జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సిల్వస్సాకు చెందిన ఓ వ్యక్తి త్రివర్ణ పతాకంతో చికెన్ శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు ఓ పౌల్ట్రీ షాపులో షాపులో పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు చికెన్ ను శుభ్రం చేయడానికి గుడ్డకు బదులు జాతీయ జెండాను ఉపయోగించాడు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది స్థానిక సిల్వస్సా పోలీసులకు కూడా చేరింది.
దీంతో ఆ వ్యక్తి కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఆ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం 1971లోని సెక్షన్ 2 కింద నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం అరెస్టు చేసి శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
జాతీయ పతాకాన్ని బహిరంగ ప్రదేశంలో లేదా మరేదైనా ప్రదేశంలో కాల్చడం, వికృతీకరించడం, అపవిత్రం చేయడం, అపవిత్రం చేయడం, ధ్వంసం చేయడం లేదా తొక్కడం వంటి చర్యలకు పాల్పడం నేరం. అలాంటి చేస్టలకు పాల్పడే వారిని జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్- 2 కింద వ్యక్తిని అరెస్టు చేస్తారు. నేరం రుజువైతే ఆ వ్యక్తికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
36 గంటల్లో 5300 కిలో మీటర్లు.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇదే..
ఇటీవల యూపీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఝాన్సీలో ఓ వ్యక్తి పుచ్చకాయల దుమ్మును శుభ్రం చేయడానికి త్రివర్ణ పతాకాన్ని వినియోగించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్ లో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.