Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ ఎఫెక్ట్: తల్లి దగ్గరకు బిడ్డను చేర్చిన కోర్టు.. ఏడాది పోరాటానికి విజయం

కేరళలో తల్లికి తెలియకుండా కొడుకును దత్తత ఇచ్చిన ఘటన ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆ తండ్రి కూతురి కొడుకును ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చాడు. తమ కొడుకు కావాలని రోడ్డెక్కిన అనుపమ దంపతులు ఏడాదిపాటు పోరాడారు. ఎట్టకేలకు కోర్టు ఆ బిడ్డను వారి దగ్గరకు చేర్చింది. ఈ ఘటనను తొలిసారి ఏషియానెట్ మలయాళం విభాగం ప్రసారం చేసింది. ఆ తర్వాత ప్రజల దృష్టికి రావడం.. ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ నిలదీయడం.. ఆ తర్వాత కేసు ఫైల్ కావడంతో ఈ రోజు ఆ బిడ్డ తల్లిదండ్రుల వద్దకు చేరింది.
 

finally anupama gets her baby by court in kerala adoption row
Author
Thiruvananthapuram, First Published Nov 24, 2021, 7:11 PM IST

తిరువనంతపురం: సామాజిక జాఢ్యాలను బద్ధలు చేయడంలో మీడియా పాత్రను మరోసారి ఏషియానెట్ చేసిచూపించింది. పురోగతి రాష్ట్రంగా అభివర్ణించే కేరళలో అధికారిక పార్టీకి చెందిన ఓ నేత కుటుంబం తల్లికి తెలియకుండా బిడ్డను దత్తతకు ఇచ్చిన ఘటనను తొలిసారిగా ఏషియానెట్ న్యూస్(మలయాళం విభాగం) ప్రసారం చేసి పోరాటంలో ఆ జంటకు అండగా నిలిచింది. పెళ్లి చేసుకోక ముందే గర్భం దాల్చిందని, వారిద్దరినీ విడదీయాలని చూడటమే కాదు.. కన్న బిడ్డనూ ఆమెకు తెలియకుండా దత్తతకు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకుని తన బిడ్డ తనకు కావాలని రోడ్డెక్కింది ఆ తల్లి. కానీ, ఆమె తండ్రికి అధికార పార్టీ అండ ఉండటంతో పోలీసులూ కొంత వెనుకడుగు వేశారు. చివరకు ఆమె మీడియా ముందుకు వచ్చి  తన గాధను చెప్పుకున్న తర్వాత ప్రతిపక్షాల నిలదీతతో ప్రభుత్వం కూడా డిఫెన్స్‌లో పడే పరిస్థితికి వచ్చింది. ఎట్టకేలకు న్యాయస్థానం తల్లీ బిడ్డలను బుధవారం ఏకం చేసింది. ఏడాదిపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

దళిత వర్గానికి చెందిన అజిత్ కుమార్, ఉన్నత వర్గానికి చెందిన అనుపమల కుటుంబాలు అధికార పార్టీ సీపీఎంకు మద్దతునిచ్చేవే. వీరిరువురూ పార్టీలోని యువజన, స్టూడెంట్ విభాగాల్లో పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. మిత్రుత్వం నుంచే కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. సహజీవనం చేశారు. అనుపమ గర్భం దాల్చింది. అజిత్‌తో కలిసి ఉండటం, పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చడం అనుపమ కుటుంబానికి అసంతృప్తి కలిగింది. ప్రసవానికి నెలన్నర ముందు అనుపమ తన గర్భం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. గర్భస్త సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసమని ఆమెను ఇంటికి రప్పించారు. ఆ తర్వాత ఆమె భాగస్వామి అజిత్‌తో మాట్లాడకుండా కట్టడి చేశారు. అనుపమ తండ్రి బ్యాంక్ మేనేజర్. సీపీఎం పార్టీ స్థానిక నేత. ఆయన తల్లిదండ్రులూ సీపీఎం మద్దతుదారులే. 

Also Read: దత్తత పేరుతో దారుణం.. ఆరేళ్ల చిన్నారికి ఆహారం పెట్టకుండా నోరు, చేతులకు టేప్ వేసి, కుక్కల బోనులో బంధించి...

స్థానిక హాస్పిటల్‌లో ఆమె ప్రసవించింది. ఆమెను బేబీని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ, ఆమె సోదరి పెళ్లి జరిగే వరకు అంటే సుమారు మూడు నెలలు స్నేహితురాలి ఇంటిలో ఉండాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత బేబీని ఆమె తండ్రి కారులో తీసుకెళ్లినట్టు అనుపమ చెప్పింది. బేబీని సురక్షితంగా ఉంచి.. తాను మళ్లీ కలిసే వీలున్న చోటుకే తీసుకెళ్లుతున్నట్ట తండ్రి చెప్పాడని వివరించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తన సోదరి పెళ్లికి ఇంటికి వెళ్లగానే తనకు తన కుమారుడు కనిపించలేదని అనుపమ తెలిపింది. ఆ తర్వాత ఆమె అజిత్ కుటుంబం దగ్గరకు వెళ్లింది. అనంతరం తమ కొడుకు కోసం వెతకడం ప్రారంభించారు. హాస్పిటల్‌లో బర్త్ సర్టిఫికేట్‌పై అజిత్‌కు బదులు మరొకరి పేరు ఉన్నట్టు ఆమె వివరించింది. తర్వాత పోలీసులను ఆశ్రయించారు. కానీ, అనపమనే మిస్సింగ్‌లో ఉన్నట్టు తండ్రి కేసు పెట్టారని, బేబీ మిస్సింగ్ కేసు నమోదు చేయబోమని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులే అసలు విషయం వారికి చెప్పారు. అనుపమ అనుమతితోనే ఆమె కొడుకును దత్తత ఇచ్చినట్టు తండ్రి చెప్పాడని అనుపమ జంటకు వివరించారు. అనుపమ, అజిత్ ఖంగుతిన్నారు.

Also Read: చలించిపోయిన దిల్ రాజు.. ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని ప్రకటన

మీడియా ముందుకు వచ్చి వారు తమ బాధలు చెప్పుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా స్పందన వచ్చింది. విపక్ష పార్టీలు అసెంబ్లీలోనే సీపీఎంను నిలదీశాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులూ వారికి సహకరించారు. అసంతృప్తి పెరుగుతుండటంతో అనుపమ కుటుంబీకులు ఆరుగురిపై కేసు ఫైల్ అయింది. దత్తత ఇచ్చే ఏజెన్సీ ఆ బేబీని ఆంధ్రప్రదేశ్ దంపతుల నుంచి వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్ఏ టెస్టు జరిగింది. ఇందులో ఆ బేబీ అనుపమ, అజిత్‌ల కుమారుడే అని తేలింది. బుధవారం కోర్టు ఆ బిడ్డను అనుపమ, అజిత్‌ల దగ్గరకు చేర్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios