Asianet News TeluguAsianet News Telugu

దత్తత పేరుతో దారుణం.. ఆరేళ్ల చిన్నారికి ఆహారం పెట్టకుండా నోరు, చేతులకు టేప్ వేసి, కుక్కల బోనులో బంధించి...

చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు, సైకోలు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలో సంచటనం సృష్టించింది.

She Died With Mouth Taped, Locked in Dog Cage : Details of 6-year-old Girl's 'Murder' by Parents
Author
Hyderabad, First Published Nov 15, 2021, 12:45 PM IST

వాషింగ్టన్ : ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులకు భారమై అనాథాశ్రమంలో చేరారు. ఓ రోజు ఇద్దరు దంపతులు వచ్చి.. ఆ అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షన దొరికిందని ఆ చిన్నారులు ఎంతో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు, సైకోలు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. 

ఈ దారుణం అమెరికాలో సంచటనం సృష్టించింది. కనీసం అనాథాశ్రమంలో ఉంటేనైనా చిన్నారి బతికి ఉండేది కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్లు. ఆ వివరాల్లోకి వెడితే.. 
 
హవాయికి చెందిన దంపతులు ఐజాక్ కలువా (52), లెహువా కలువా(43) దంపతులు హత్యగావించబడిన ఇసాబెల్లాను 208లో దత్తత తీసుకున్నారు. ఇసాబెల్లా కంటే ముందు ఆమె సోదరిని 2009లో దత్తత తీసుకున్నారు కలువా దంపతులు. ఆ తరువాత ఇసబెల్లా మరో ఇద్దరు తోబుట్టువులను 2018, 2020లో దత్తత తీసుకున్నారు.

ఇసాబెల్లా తల్లిదండ్రులు వైమన ప్రాంతంలో నివసిస్తుండేవారు. వారు కటిక పేదరికం అనుభవిస్తుండటంతో పిల్లలను కలువా దంపతలుకు దత్తత ఇచ్చారు. kaluva couple రాక్షసులకు మారుపేరులాంటివారు. చిన్నారులను దత్తతకు తీసుకున్న వీరు వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఆరేళ్ల Isabellaను అత్యంత దారుణంగా హింసించేవారు. చిన్నారికి సరిగా తిండి పెట్టేవారు కారు. ఆకలికి తట్టుకోలేక రాత్రిళ్లు లేచి ఆహారం కోసం వెతికేది ఇసాబెల్లా.

ఈ క్రమంలో కలువా దంపతులు ఇసాబెల్లను బంధించడం కోసం కుక్కల బోనును ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించారు. చిన్నారి హత్య జరిగిననాడు కూడా.. రోజూలాగే ఇసాబెల్లాకు food పెట్టకుండా Torture చేశారు. రాత్రిళ్లు ఆహారం కోసం వెతకకుండా ఉండేందుకుగాను ఇసాబెల్లా నోటికి, చేతులు డక్ టేప్ వేసి Dog cageలో బంధించారు. ఆ తరువాత బోనును బాత్రూంలో పెట్టారు. 

ఈ క్రమంలో ఇసాబెల్లా కన్నా ముందు కలువా ఇంటికి దత్తతకు వచ్చిన ఆమె సోదరి, చెల్లెలు బెడ్ మీద కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికింది. bathroomలో కుక్కల బోనులో ఉన్న ఇసాబెల్లాను గుర్తించి.. బెడ్ రూంలోకి తీసుకొచ్చింది. అప్పటికే ఇసాబెల్లా అపస్మారక స్తితిలో ఉంది. దీన్ని గురించి బాధిత చిన్నారి అక్క కలువా దంపతులకు చెప్పింది. వారు వచ్చి ఇసాబెల్లాను బాత్ టబ్ లో పడుకోబెట్టి నీరు పెట్టారు. కానీ ఇసాబెల్లా మేల్కోలేదు. 

చిన్నారి చనిపోయినట్లు నిర్థారించుకున్న కలువా దంపతులు.. మిగతా పిల్లలకు తెలియకుండా బాలిక dead bodyని మాయం చేశారు. దీని గురించి ఎవరికి చెప్పొద్దని ఇసాబెల్లా అక్కను బెదిరించారు.  ఆ తరువాత bath tab, డాగ్ బోన్ ను ధ్వంసం చేశారు. ఆ తరువాత ఐజాక్ లువ తనకు covid-19 లక్షనాలు ఉన్నాయని చెప్పి ఆస్పత్రిలో చేరాడు. 

2021, సెప్టెంబర్ 12న ఇసాబెల్లాను హత్య చేసిన నెల రోజుల తరువాత అనగా అక్టోబర్ 12 కలువా దంపతులు అనుమానం రాకుండా ఉండడం కోసం చిన్నారి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇసాబెల్లా కోసం వందలాడి వలంటీర్లు గాలించారు. 

child వారి సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఉంటుందని భావించి, వైమన ప్రాంతం అంతా గాలించారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించిన చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు డిటెక్టివ్ సాయం కూడా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇసాబెల్లా అక్క జరిగిన దారుణం గురించి డిటెక్టివ్ కు వివరించింది. 

రిమాండ్ లో ఉన్న మహిళతో జైలులో నగ్నంగా డ్యాన్స్... లేడీ ఇన్ స్పెక్టర్ డిస్మిస్...

ఈ క్రమంలో పోలీసులు కలువా దంపతుల Online Order History గురించి చెక్ చేయగా కుక్కల బోను order చేసినట్లు తెలిసింది. ఆధారాలు అన్ని సేకరించిన హోనలులూ పోలీసు డిపార్ట్ మెంట్ అధికారులు కలువా దంపతులను అరెస్ట్ చేశారు. 

విచారణలో కోర్టు కలువా దంపతులు క్షమాభిక్షకు అనర్హులని తేల్చింది. చిన్నారి కనీసం అనాథాశ్రమంలో ఉంటే బతికి ఉండేదని, ఈ హింస తప్పేదని కోర్టు విచారణ వ్యక్తం చేసింది. కలువా దంపతులు కఠిన శిక్షకు అర్హులని తేల్చింది.  

Follow Us:
Download App:
  • android
  • ios