ఓ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో భార్యకు, రెండో భార్యకు పడలేదు. తరచూ గొడవలు పడ్డారు. ఈ క్రమంలో రెండో భార్య, ఆమె కుమారుడు సజీవదహనం అయి కనిపించారు. 

తమిళనాడు : తమిళనాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లాలో సవతుల మధ్య జరిగిన పోరులో ఓ తల్లి, కుమారుడు సజీవ దహనం అయిన విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55) వీధి నాటకం ఆడే కళాకారుడు. ఇతడు ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్వీ అనే మహిళను మొదటగా వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

ఆ తర్వాత సెందామరై కన్నన్ కీల్ కుప్పం ప్రాంతానికి చెందిన కమల(47)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అందులో కుమార్తె వివాహం అయింది. కుమారుడు గురు(17) ప్లస్ టూ చదివి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సెందామరై కన్నన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య పేరు సత్య (30). వీరికి ఒక కొడుకు ముత్తు ఉన్నాడు. అయితే, రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ నేపథ్యంలో కమల, గురు బుధవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయారు. గురువారం ఉదయం వారు ఎంతకీ ఇంట్లో నుంచి బయటికి రాలేదు. దీంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి చూశారు. ఆ తర్వాత కల్లావి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి తలుపులు పగలగొట్టి చూశారు. లోపల కాలిపోయిన స్థితిలో కమల, మృతదేహాలు కనిపించాయి,

పోలీసుల దర్యాప్తులో ఇద్దరు సజీవదహనం అయినట్లు తేలింది. సమాచారం అందుకున్న ఊతంకరై డీఎస్పీ అలెగ్జాండర్ విచారణ పట్టారు. ఇద్దరు మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రాథమిక విచారణలో సవతుల గొడవలు, ఇద్దరు సజీవదహనం కావడం మీద సెందామరై కన్నన్, సత్యను పోలీసులు విచారణ చేస్తున్నారు. 

వివాహిత తాళిని తీయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనం.. మద్రాస్ హై కోర్టు

ఇదిలా ఉండగా, సహజీవనం చేస్తున్న మహిళకు ఓ వ్యక్తి ఎనిమిదేళ్లలో పద్నాలుగు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడు. దీంతోపాటు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న 33 యేళ్ల బాదితురాలితో బీహార్కు చెందిన గౌతమ్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి, ఇష్టానికి దారి తీసింది.

గౌతమ్ ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడిని నమ్మిన ఆమె, అతను ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్లలో ఆమెకు పద్నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో ఆమె జూలై 5న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె దుస్తుల్లో సూసైడ్ నోట్ లభించింది. ‘అతడు చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించాను. నా సెల్ ఫోన్ లో చెక్ చేయండి’ అని ఆ నోట్ లో మహిళ రాసిపెట్టింది.