లిఫ్ట్ లో పెంపుడు కుక్కను తీసుకొస్తుందని గొడవ.. మహిళను చెంపదెబ్బ కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి..
పెంపుడు జంతువును లిఫ్ట్ లో తీసుకువస్తుందని మహిళతో గొడవకు దిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు ఆ మహిళను చెంపదెబ్బ కొట్టారు.
నోయిడా : పెంపుడు కుక్కలకు సంబంధించిన వివాదం ఓ మాజీ ఐఏఎస్ అధికారిపై చర్చకు దారి తీసింది. ఆ అధికారి లిఫ్టులో పెంపుడు కుక్కను తీసుకువస్తుందన్న కారణంతో మహిళను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 108 పార్క్ లారేట్ సొసైటీలో వెలుగు చూసింది. ఈ సొసైటీలో ఉండే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్‌పి గుప్తా.. ఓ మహిళను తన పెంపుడు కుక్కతో లిఫ్ట్ రావడానికి నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీనిమీద నోయిడా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయగా, దర్యాప్తు జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గుప్తా రికార్డ్ చేయకుండా ఆపడానికి ప్రయత్నించడం, ఆ మాజీ అధికారి మహిళను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, మహిళ కూడా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దెబ్బలను అడ్డుకోవడానికి తన చేతిని ఉపయోగించడాన్ని చూడవచ్చు.
అమానుషం.. బిస్కెట్లు దొంగలించారని చిన్నారులను పోల్ కు కట్టేసి కొట్టిన షాప్ ఓనర్.. వీడియో వైరల్..
అయితే, ఈ ఘటన తరువాత ఆ మహిళ భర్త అక్కడికి వచ్చి మాజీ ఐఏఎస్ అధికారిని తీవ్రంగా దూషించాడని సమాచారం. దీనిమీద గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసు కమిషనరేట్ లో ఫిర్యాదు నమోదయ్యింది. “కుక్కను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లే విషయంలో వివాదం నెలకొంది. సంఘటనా స్థలంలో ఏసీపీ-1 నోయిడా మాయ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణ తర్వాత, అవసరమైన చర్యలు తీసుకుంటాము, ”అని పోలీస్ కమిషనరేట్ గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు ఎక్స్ లో పోస్ట్ చేశారు.