Asianet News TeluguAsianet News Telugu

అమానుషం.. బిస్కెట్లు దొంగలించారని చిన్నారులను పోల్ కు కట్టేసి కొట్టిన షాప్ ఓనర్.. వీడియో వైరల్..

కుర్ కురే, బిస్కెట్ ప్యాకెట్లు చోరీ చేశారనే ఆరోపణలతో ఓ షాప్ ఓనర్ దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు చిన్నారులను పోల్ కు కట్టేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Inhumane.. The shop owner tied the girls to a pole and beat them for stealing biscuits.. Video viral..ISR
Author
First Published Oct 31, 2023, 11:00 AM IST

బీహార్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. బిస్కెట్లు దొంగిలించారనే ఆరోపణలతో నలుగురు చిన్నారుల పట్ల ఓ కిరాణా షాప్ ఓనర్ అమానుష చర్యకు పాల్పడ్డాడు. వారిని ఓ పోల్ కు కట్టేసి ఘోరంగా చితకబాదాడు. ఈ ఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పోలీసులు తెలిపిన వివరాలు, ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం..  బెగుసరాయ్ జిల్లా బీర్పూర్ తాలుకాలోని ఫాజిల్పూర్ గ్రామంలో ఓ కిరాణా షాప్ ఉంది. అయితే ఆ గ్రామంలోని నలుగురు చిన్నారులు ఈ నెల 28వ తేదీన ఆ షాప్ నుంచి కుర్ కురే, బిస్కెట్ ప్యాకెట్లను దొంగిలించారు. దీనిని ఆ షాప్ ఓనర్ గమనించాడు. వారిని పట్టుకొని దగ్గరలో ఉన్న ఓ పోల్ దగ్గరికి తీసుకెళ్లాడు. 

ఆ పోల్ కు వారి చేతులను కట్టేశాడు. అనంతరం వారిని చికతబాదాడు. ఆ సమయంలో పలువురు అక్కడే నిలబడి ఈ దుశ్చర్యంతా చూస్తున్నారు. తరువాత వారిని విడిచిపెట్టారు. బాధిత బాలురు ఇంటికి వెళ్లగా.. పిల్లల పరిస్థితి చూసి ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో జరిగిందంతా బాలురు వివరించారు. కానీ దీనిపై వారు ఫిర్యాదు చేయలేదు. అయితే బాలురను పోల్ కు కట్టేసి, కొట్టిన ఘటనను అక్కడున్న పలువురు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ఈ వీడియో వైరల్ గా మారింది. చివరికి అది స్థానిక పోలీసుల వరకు చేరింది. బాధితులను పోలీసులు గుర్తించారు. బాలుర తల్లిదండ్రులను సంప్రదించి, షాప్ ఓనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని కోరారు. కానీ పోలీసులు దానికి అంగీకరించలేదు. దీనిపై బెగుసరాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ స్పందిస్తూ..  పిల్లలను పోల్ కు కట్టేసి, కొట్టి షాప్ ఓనర్ చాలా తప్పు చేశాడని చెప్పారు. పిల్లలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం తీవ్రమైన నేరమని అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios