పలువురు తమ రాజకీయ లబ్ది కోెసం తనపై కల్పిత, అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. తాను బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారని ఆరోపించారు. 

పలు బహిరంగ కార్యక్రమాల్లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వారి రాజకీయ లబ్ది కోసం కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా ‘కల్పిత ప్రచారం’ చేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ అన్నారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించినా తనపై ఎలాంటి ప్రభావం ఉండదని గడ్కరీ చెబుతున్నట్టుగా వీడియో ఒక‌టి స‌ర్క్యూలేట్ అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న గురువారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.

గ‌డ్క‌రీ త‌న తన ప్రసంగం పూర్తి వీడియోను పంచుకుంటూ ఇలాంటి దుశ్చర్యలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “ ఈరోజు మరోసారి, రాజకీయ మైలేజ్ కోసం నాపై నీచమైన, కల్పిత ప్రచారాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియా, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు నేను ప‌లు కార్య‌క్ర‌మాల్లో మాట్లాడిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి అస‌త్య‌మైన వీడియోను రూపొందించారు.’’ అని అన్నారు. 

‘ఆపరేషన్ లోటస్’ ఫెయిల్.. మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోవ‌డం కంటే చ‌నిపోవ‌డమే మంచిద‌ని భావిస్తారు - కేజ్రీవాల్

తనపై దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనుకాడబోనని గడ్కరీ హెచ్కరించారు. ‘‘ అయినా అలాంటి దురుద్దేశక పూర్వకమైన ఎజెండాల వల్ల నేను ఎప్పుడూ కలవరపడలేదు. కానీ ఇలాంటి దుశ్చర్యలు ఇంకా కొన‌సాగిస్తే మా ప్రభుత్వం, పార్టీ, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే లక్షలాది మంది కార్య‌క‌ర్త‌ల ప్రయోజనాల కోసం నేను వారిని చ‌ట్టం ద్వారా శిక్షించేలా చేయ‌డానికి వెన‌కాడ‌బోన‌ని అంద‌రికీ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాను. అందుకే తాను నిజంగా మాట్లాడిన లింక్ ను షేర్ చేస్తున్నాను ’’ అని ఆయన పీఎంవో, బీజేపీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డాను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ ట్వీట్లతో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

కాగా.. గత వారం బీజేపీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దాని పార్లమెంటరీ బోర్డు, అత్యున్నత సంస్థాగత సంస్థ నుండి గడ్కరీని తొలగించింది. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయ‌న ఇటీవ‌ల మండిపడ్డారు.

Scroll to load tweet…

నితీన్ గ‌డ్క‌రీ ఓ పుస్తకావిష్క‌ర‌ణ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి ఎడిట్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో స‌ర్క్యూలేట్ అవుతోంది. అయితే ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. గడ్కరీ ఇలా మాట్లాడార‌ని ప్ర‌శ్నించారు. ‘ బీజేపీ మే బహుత్ బడీ గద్బద్ చల్ రహీ హై (బీజేపీలో ఏదో లోపం ఉంది)’ అని గురువారం ఉదయం ట్వీట్ చేశారు.

ఎవరి పాత్ర ఏంటో త్వరలోనే తేలుతుంది : కవిత పరువు నష్టం దావాపై బీజేపీ ఎంపీ పర్వేష్

పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తినే పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారని, ‘‘ అవుట్ ఆఫ్ టర్న్’’, కలర్ ఫుల్ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయ‌న‌ను తొల‌గించార‌ని ఆ మూలాలు పేర్కొంటున్నాయ‌ని ఓ ప్ర‌ముఖ వార్తాపత్రిక క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసిన ఒక రోజు త‌రువాత గ‌డ్క‌రీ నుంచి ఈ ట్వీట్ వ‌చ్చింది. ఈ ట్వీట్ లో ఆయ‌న పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడిని వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ఉన్న లింక్ ను షేర్ చేశారు.