Asianet News TeluguAsianet News Telugu

భ‌యంతో లోయను వ‌దిలిన పండిట్ల‌లో కొంత మందే తిరిగొస్తున్నారు - ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త క‌ర‌ణ్ సింగ్

కాశ్మీర్ లోయను వదిలి వలస వెళ్లిన వారిలో అతి కొద్ది మాత్రమే తిరిగి వస్తున్నారని ప్రముఖ రాజకీయవేత్త క‌ర‌ణ్ సింగ్ అన్నారు. అవకాశం, స్థోమత ఉన్న వారందరూ దేశ, విదేశాల్లో స్థిరపడ్డారని చెప్పారు. 

Few of the Pandits who left the valley in fear are returning - Prominent politician Karan Singh
Author
First Published Sep 8, 2022, 1:49 PM IST

భ‌యం, ఆందోళ‌న‌తో లోయ‌ను వ‌దిలిన వారిలో అతి కొద్ది మంది మాత్ర‌మే తిరిగి త‌మ సొంత గూటికి చేరుకుంటున్నార‌ని ప్రముఖ రాజకీయవేత్త కరణ్ సింగ్ అన్నారు. సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ జ్ఞాపకాలతో రూపొందించిన ‘‘వెన్ ద హార్ట్ స్పీక్స్’’ అనే పుస్తక ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. బ‌య‌ట‌కు వెళ్లి బ‌త‌క‌గ‌లిగే స్థోమత ఉన్న చాలా మంది కాశ్మీరీ పండిట్లు విదేశాల్లో లేదా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిర‌ప‌డ్డార‌ని చెప్పారు. అయితే కాశ్మీరీ పండిట్లు లేకుండా కాశ్మీర్ ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుందని అన్నారు. 

డీఆర్డీవో చ‌రిత్రలో మ‌రో మైలు రాయి.. క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్ ప‌రీక్ష స‌క్సెస్

‘‘ కశ్మీర్ అందంగా, మోసపూరితంగా ఉంది. 1947 నుండి లోయను స్వాధీనం చేసుకున్న విధానం హృదయ విదారకంగా ఉంది ’’ అని అన్నారు. డాక్టర్ కౌల్, ఆయ‌న లాంటి మ‌రి కొంత మంది కాశ్మీరీ పండిట్‌లు తిరిగి వచ్చి లోయలో తమ ఇళ్లను నిర్మించుకోవ‌డం అభినంద‌నీయం అని అన్నారు. కానీ ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారు. ‘‘ చాలా కొద్ది మంది కాశ్మీరీ పండిట్‌లు అలా చేస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడూ భయం, భయాందోళనలు ఉంటాయి. అది మ‌న‌సులో నుంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వారు (కాశ్మీరీ పండిట్లు) అనుభవించిన గాయం అలాంటిది. ఇప్పుడే దానిని మ‌ళ్లీ ఎదుర్కోవ‌డానికి వారు సిద్ధంగా లేర‌ని నేను భావిస్తున్నాను ’’ అని కరణ్ సింగ్ అన్నారు.

స్కూటీని శుభ్రం చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఉప‌యోగించిన వ్య‌క్తి అరెస్టు

1990వ దశకంలో కాశ్మీరీ పండిట్ల వలసను జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత భయంకరమైన, విషాదకరమైన సంఘటనలలో ఒకటిగా సింగ్ అభివర్ణించారు. ‘‘ లోయ నుంచి  తప్పించుకోగలిగిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోయారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడగలిగే వ్యక్తులు అక్కడి వెళ్లారు. మరి కొందరు విదేశాలలో స్థిరపడ్డారు. అయితే ఇక్కడికి తిరిగి వచ్చి జమ్మూలో ప్రశాంతంగా జీవిస్తున్న వలసదారులపై, తిరిగి వెళ్లాలనుకునే కాశ్మీర్ పండిట్‌లుపై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ’’ అని ఆయన అన్నారు. 

కాశ్మీరీ పండితులు తనకు అందించిన విద్య ద్వారా తాను జీవితంలో నేర్చుకున్నది చాలా ఎక్కువ అని అన్నారు. ‘‘ ఇది చాలా తెలివైన సమాజం, నేను పొందిన విద్య అంతా, అది BK మదన్, ప్రొఫెసర్ పరమానందన, ప్రొఫెసర్ PN చాకు, ప్రొఫెసర్ JN భాన్, ప్రొఫెసర్ SN పండిట్ ఇత‌రుల నుంచి నేను పొందాను. కాశ్మీరీ పండిట్ సమాజానికి నా కృతజ్ఞతలు తెలియ‌జేయ‌డానికి అవ‌కాశం ఉంది ’’ అని తెలిపారు.

మనిషి పగ... కాటేసిందని పామును కొరికి, కొరికి చంపి, మెడలో వేసుకుని.. ఊరంతా ఊరేగి..

ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్, రచయిత అయిన డాక్టర్ కౌల్ తన జ్ఞాపకాలను పుస్తకం రూపంలో రాసినందుకు కరణ్ సింగ్ ఆయ‌న‌ను ప్ర‌శంసించారు. డాక్టర్ కౌల్ గొప్ప ప్రొఫెషనల్ మాత్రమే కాదు, గొప్ప మ‌నిషి కూడా అని కొనియాడారు. కాశ్మీర్ పై, రోగుల‌పై ఉన్న ప్రేమ నిజంగా త‌న‌ను క‌దిలిస్తుంద‌ని అన్నారు. కాగా.. త‌న ప్ర‌సంగం ముగింపు సంద‌ర్భంగా ప్ర‌స్తుత వైద్య ప‌రిస్థితుల‌పై కొంత అసంతృప్తి వ్య‌క్తం చేశారు. వైద్యులు, ఫార్మా కంపెనీల మధ్య ఉన్న అనుబంధం ఫలితంగా రోగులు అనవసరమైన శస్త్రచికిత్సలు, పరీక్షలు చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని, అలాగే మందులు వాడాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios