వైరల్ వీడియో: ఒక వ్యక్తి తన స్కూటీని శుభ్రం చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు జాతీయ జెండాను, దేశాన్ని అవమానపర్చిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వైరల్ వీడియో: భారత దేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వజ్రోత్సవాలను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడానికి మార్గదర్శకాలలో మార్పులు సైతం తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే త్రివర్ణ పతాకం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, దాని గౌరవాన్ని కాపాడాలని కూడా పేర్కొంది. అయితే, కొన్ని చోట్ల త్రివర్ణ పతాకానికి అవమానం జరిగిన సంఘటనలు వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన స్కూటీని తుడవడానికి భారత జాతీయ జెండాను ఉపయోగించాడు.
ఒక వ్యక్తి తన స్కూటీని శుభ్రం చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు జాతీయ జెండాను అవమానపర్చిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కూడా అరెస్టు చేశారు. వైరల్ వీడియోలో, వ్యక్తి తన స్కూటీలోని దుమ్మును శుభ్రం చేయడానికి జాతీయ జెండాను ఉపయోగించడం కనిపించింది. అతని స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు త్రివర్ణ పతాకాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాన్ని శుభ్రం చేసేందుకు జాతీయ జెండాను ఉపయోగించినందుకు 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, ఆ వ్యక్తి ఉత్తర ఘోండా ప్రాంతానికి చెందినవాడని చెప్పారు. స్థానికులు చిత్రీకరించిన ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత వీడియోలో వ్యక్తి తన తెల్లటి ద్విచక్ర వాహనాన్ని ముడుచుకున్న జాతీయ జెండాతో శుభ్రం చేసి, దుమ్ము దులిపేస్తున్నట్లు కనిపించాడు. "ఈ విషయంలో, చట్టపరమైన చర్య ప్రారంభించబడింది. భజన్‌పురా పోలీస్ స్టేషన్‌లో జాతీయ గౌరవానికి అవమానం నిరోధించే చట్టం-1971 సెక్షన్ 2 కింద కేసు నమోదు చేయబడింది" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
వ్యక్తి ఉపయోగించిన జెండా, అతని స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. "నిందితుడిని దర్యాప్తులో చేయగా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదనీ, పొరపాటున అలా చేశాడని చెప్పాడు. మేము ఇంకా విచారణలో జరుపుతున్నాం.. కోర్టు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని మేము అతనికి సూచించాము" అని అధికారి తెలిపారు.
