డీఆర్డీవో పూర్తి స్వదేశీ ప‌రిజ్క్షానంతో రూపొందించిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (QRSAM)ను విజయవంతంగా పరీక్షించారు.   ఈ క్షిపణి వ్యవస్థ మొబైల్ లాంచర్ నుండి ప్రయోగించబడింది. ఇది కాల్పులు జరిపిన వెంటనే స్థలాన్ని సులభంగా మారుస్తుంది, తద్వారా శత్రువు దానిని సులభంగా పట్టుకోలేరు.

రక్షణ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. స్వదేశీ ప‌రిజ్ఞానంతో 
ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (DRDO) రూపొందించిన రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్(QRSAM)ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి వ్యవస్థ అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.

అధికారిక సమాచారం ప్రకారం.. రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్(QRSAM) పరీక్షను డీఆర్‌డీవో, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ క్షిపణి వ్యవస్థను ప్రయోగించారు. ఈ సమయంలో క్విక్ రియాక్షన్ మిస్సైల్ 6 షాట్‌లను ప్ర‌యోగించారు. ఈ ప‌రీక్ష‌లో ఈ క్షిపణి పూర్తిగా విజయవంత మైందని అధికారులు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా DRDO అధికారి మాట్లాడుతూ- "హై-స్పీడ్ ఎయిర్ టార్గెట్‌లకు వ్యతిరేకంగా పరీక్షలు నిర్వహించబడ్డాయి. వీటిలో సుదూర మధ్యస్థ ఎత్తు, తక్కువ-శ్రేణి అధిక ఎత్తు, రెండు క్షిపణులతో సాల్వో ప్రయోగాలు చేసిన‌ట్టు తెలిపారు. దీనితో పాటు క్షిపణి వ్యవస్థ ప‌నితీరును తెలుసుకోవడానికి రాత్రిప‌గ‌లు రెండింటిలోనూ ప్రయోగించిన‌ట్టు పరీక్షించారు. అందులో కూడా ఈ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ విజయవంతమైందని, పరీక్షలు విజయవంత మయ్యాయని, మిషన్ లక్ష్యాలన్నీ నెరవేరాయని DRDO తెలిపింది. ఈ ప్ర‌యోగాలు డీఆర్డీవో, ఆర్మీ సీనియర్ అధికారుల సమక్షంలో పరీక్షించారు. 

ఫైనల్‌ డెప్లాయ్‌మెంట్‌ కాన్ఫిరిగేషన్‌లో భాగంగా స్వదేశీ ఆర్‌ఎఫ్‌ సీకర్‌, మొబైల్ లాంచర్, పూర్తిగా ఆటోమేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, నిఘా, మల్టీ ఫంక్షన్ రాడార్‌లతో కూడిన క్షిపణితో సహా స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన రాడార్ వ్య‌వ‌స్థ‌ను ప్రయోగించిన‌ట్టు తెలిపారు.

ఈ మిస్సైల్‌ ఓ షార్ట్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌. ఈ మిస్సైల్‌ 30 కిలోమీటర్ల పరిధిలో పది కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎరిగే లక్ష్యాలను ఛేధిస్తుంది. దీన్ని వెపన్‌ సిస్టమ్స్‌ భారత సైన్యంలో చేర్చనున్నారు.

ఈ క్షిపణి వ్యవస్థకు శత్రువులను, ఆయుధాలను కనుగొని నాశ‌నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులోని స్వదేశీ పరికరాలు దానికి భిన్నమైన గుర్తింపును ఇస్తాయి. ఇది ప్రయోగించబడిన మొబైల్ లాంచర్ కాల్పుల తర్వాత దాని స్థానాన్ని త్వరగా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, తద్వారా శత్రువు రాడార్లు దానిని సులభంగా పట్టుకోలేవు.

Scroll to load tweet…