పశ్చిమ బెంగాల్ లో శ్రీరామనవమి వేడుకల్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో హనుమాన్ జయంతికి పకడ్భందీగా శాంతి భద్రతల కోసం ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని కోసం కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని సూచించింది. 

పశ్చి మ బెంగాల్ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరాలని కలకత్తా హైకోర్టు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత వారం శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా హౌరా, హుగ్లీలో హింస చెలరేగిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖలు

షిబ్పూర్, రిష్రాలో ఇటీవల జరిగిన హింసాకాండపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్య నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఈ విధంగా ఆదేశించింది. రాబోయే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పారామిలటరీ బలగాలను మోహరించాలని కోరవచ్చని హైకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి తెలిపింది.

NCERT పాఠ్యాంశాల్లో కీలక మార్పులు.. మహాత్మా గాంధీ, నాథూరామ్ గాడ్సే, ఆర్ఎస్ఎస్ వంటి అంశాల తొలగింపు !

ఇదిలా ఉండగా.. హౌరాలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన హింసపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరింది. శ్రీరామనవమి రోజున రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇందులో దుండగులు పలు వాహనాలను తగలబెట్టడంతో పాటు హౌరాలో దుకాణాలను ధ్వంసం చేశారు.

ఏప్రిల్ 2న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ పర్సురా ఎమ్మెల్యే బిమన్ ఘోష్ పాల్గొన్న శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా రిష్రాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రిష్రాలో 144 సెక్షన్ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శ్రీరాంపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ కూడా అధికార యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

శ్రీరామనవమి హింసాకాండపై బీహార్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. బీజేపీ ఎమ్మెల్యేను బయటకు లాక్కెళ్లిన మార్షల్స్..

కాగా.. వచ్చే హనుమాన్ జయంతి వేడుకల్లో ముస్లింలను హిందువులు రక్షించాలని మమతా బెనర్జీ బుధవారం కోరారు. ఏప్రిల్ 6న దేశమంతా హనుమాన్ జయంతి జరుపుకునే సమయంలో బెంగాల్ లో మరోసారి హింసను ప్రేరేపించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని తృణమూల్ అధినేత్రి ఆరోపించారు.