భీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు పెద్దపీట: 49 నుండి 74 శాతానికి ఎఫ్‌డీఐలకు ఓకే
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం తలుపులు తెరిచింది. ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడులను 49 శాతం నుండి 74 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం తలుపులు తెరిచింది. ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడులను 49 శాతం నుండి 74 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులను కొంత శాతం వరకే పరిమితం చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ దఫా 74 శాతానికి ఈ పెట్టుబడులను పెంచాలని నిర్ణయం తీసుకొంది.1938 భీమా చట్టం సవరణ, డిపాజిట్లపై భీమాను పెంచనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
also read:కేసీఆర్ బాటలోనే: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణలక్ష్మి పథకం
ఇన్సూరెన్స్ రంగంలో మేనేజ్‌మెంట్ సిబ్బందిలో మెజారిటీ భారతీయులే ఉంటారని కేంద్రం తెలిపింది. భీమా సంస్థల్లో మూలధన ప్రవాహాన్ని పెంచడంతో పాటు విస్తరణను పెంచేందుకు ఇది సహాయ పడుతోందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ ఏడాదిలో ఎల్ఐసీ ఐపీవోను విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ ఈ విషయాన్ని తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహారణకు పెద్దపీట వేయాలని కూడ కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ అంశాన్ని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.