మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారయత్నం.. భార్య ఇంట్లోలేని సమయంలో ఘాతుకం..
భార్య ఇంట్లో లేని సమయంలో మైనర్ కూతురిపై అత్యాచారయత్నం చేశాడో కీచకతండ్రి. పోలీసులకు తెలియడంతో అరెస్ట్ అయ్యాడు.

సిల్చార్ : కరీంగంజ్‌లో తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తి ఆ తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని బుధవారం అరెస్టు చేశారు. గురువారం కరీంగంజ్ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. నిందితుడు తమ ఇంట్లోనే తన కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కామాంధుడైన తండ్రి నుంచి ఎలాగోలా తప్పించుకుని అన్నయ్య గదిలో తలదాచుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె తల్లి దూరంగా ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి రాగానే బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.
దారుణం.. కదులుతున్న ట్యాక్సీలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
తన కుమార్తె తన తల్లికి అన్ని విషయాలు చెప్పిందని నిందితుడికి తెలియడంతో, అతను ఆమెను దారుణంగా కొట్టాడు. ప్రస్తుతం ఆమె కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అతని భార్య ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో నిందితుడు మంగళవారం పరారయ్యాడు.
ఎఫ్ఐఆర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఇక తప్పించుకోలేనని తెలిపిన నిందితుడు బుధవారం సాయంత్రం లొంగిపోయాడు. అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)