దారుణం.. కదులుతున్న ట్యాక్సీలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో దారుణం జరిగింది. కదులుతున్న ట్యాక్సీలో ఓ దుండగుడు మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఓ చోట వదిలిపెట్టి వెళ్లాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు.

ప్రస్తుతం సమాజంలో మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కరువయ్యింది. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో, బయట వారికి రక్షణ దొరకడం లేదు. మహిళలకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోనూ ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది. మానసిక వికలాంగురాలు అని కూడా చూడకుండా ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె సోమవారం తన తల్లిదండ్రులో గొడవపడింది. దీంతో తన ఇంట్లో నుంచి తన బంధువుల ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా బయటకు వచ్చింది. ఓ ట్యాక్సీ ఆపి బంధువులు ఉండే ప్రాంతానికి వెళ్లాలని చెప్పింది.
డ్రైవర్ ప్రకాశ్ పాండే మార్గమధ్యంలో తన స్నేహితుడైన 26 ఏళ్ల షేక్ సల్మాన్ ను ట్యాక్సీ లో ఎక్కించుకున్నాడు. వాహనం కదులుతున్న సమయంలోనే సల్మాన్ ఆ బాలిక పై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను ఓ ప్రాంతంలో వదిలిపెట్టేశారు. దీంతో ఆమె తన బంధువల ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన లైంగిక దాడిని వారికి వివరించింది.
వారు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు గంటల్లోనే నిందితులైన సల్మాన్ షేక్, ప్రకాశ్ పాండేను అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.