కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురి నిండు ప్రాణాలను తీసేశాడు. అది కూడా నరబలి ఇస్తే ఆ తండ్రిని ఏమనుకోవాలి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు పుదుకొట్టై జిల్లాలోని గంధర్వకోటకు చెందిన పన్నీర్ సెల్వం అనే వ్యక్తి 13 ఏళ్ల కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందింది.

తన బిడ్డపై ఎవరో అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారని సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అత్యాచారం జరగలేదని తేలడంతో పోలీసులు చూపు పన్నీరు సెల్వంపై పడింది..

అతనిని తమదైన శైలిలో విచారించడంతో ఆ దుర్మార్గుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఓ మాంత్రికుడి సూచన మేరకు తానే తన బిడ్డను నరబలి ఇచ్చినట్లు పన్నీర్ సెల్వం అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రిమాండ్ చేశారు. 

Also Read:

కరోనా ఎఫెక్ట్: ఒడిశాలో నరబలి చేసిన పూజారి, అరెస్ట్

దారుణం: నరబలికి సొంతకూతుర్ని సిద్దం చేసిన తల్లిదండ్రులు