భువనేశ్వర్: కరోనాను శాశ్వతంగా పారిపోతుందనే ఉద్దేశ్యంతో ఒక పూజారి నిండు ప్రాణం తీశాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటన కలకలం రేపుతోంది.

ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లా బందాహుదా గ్రామానికి చెందిన సన్‌సారి ఓజా బందా  మా బుద్ద బ్రహ్మణిదేయి గుడిలో పూజారిగా ఉన్నాడు. సరోజ్ కుమార్ ప్రధాన్ పూజ చేసేందుకు ఆలయంలోకి వచ్చాడు. పూజ నిర్వహించిన తర్వాత ప్రధాన్ ఓజాను పలకరించాడు. 

కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణ త్యాగం చేస్తే దేవుడు కరుణించి కరోనాను మాయం చేస్తానని దేవుడే స్వయంగా కలలోకి వచ్చి తనకు చెప్పాడని సన్ సాన్ ఓజా    సరోజ్ ప్రధాన్ కు చెప్పాడు.

also read:కరోనా ఎఫెక్ట్: 180 మంది వెళ్లాల్సిన ఫ్లైట్‌లో నలుగురే, రూ. 10 లక్షల ఖర్చు

ఈ సమయంలో మూఢనమ్మకాలు ఏమిటని ప్రధాన్ పూజారిని ప్రశ్నించాడు. అయితే దేవుడే తనకు కలలో వచ్చి చెప్పాడంటూ పూజారి అతనితో గొడవకు దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన ఓజా తన వద్ద ఉన్న గొడ్డలితో ప్రధాన్ తలపై గట్టిగా కొట్టాడు.దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 

నిందితుడు ఓజాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన్ ను హత్య చేసినట్టుగా పూజారి ఒప్పుకొన్నాడు. మనిషి ప్రాణం త్యాగం చేస్తే కరోనా పారిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ను హత్య చేశాడంటూ' తెలిపారు.