ఓ విమానంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ ఘటన విస్తారా విమానంలో జరిగినప్పటికీ.. ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టత లేదు.
ఇటీవల కాలంలో విమానాల్లో చోటు చేసుకుంటున్న అనేక తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ విస్తారా విమానంలో కూడా ఇలాంటి తగాదాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కూతురిని అనుచితంగా తాకాడని తోటి ప్రయాణికుడిపై ఓ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు రికార్డు చేశారు. ప్రస్తుతం అది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మత విభేదాలు సృష్టించే శక్తులపై పోరాడాలి - ఎన్సీపీ అధినేత శరద్ పవార్
దీనిని అనేక మంది ట్విట్టర్ యూజర్లు షేర్ చేయడంతో ఈ ఘటనకు విమానంలో భద్రత, ఇతర విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఈ వీడియోలో.. ఓ సీటులో ఉన్న తండ్రి లేచి నిలబడి తన కుమార్తెతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై అరవడం కనిపిస్తోంది. ‘‘నా కూతురి మీద చెయ్యి వేయడానికి నీకెంత ధైర్యం?’’ అని అరుస్తున్నాడు. అదే సమయంలో పక్క నుంచి ఓ బాలిక అరుపులు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఘర్షణ తెలియడంతో క్యాబిన్ లో ఉన్న ఇద్దరు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి వారి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చాలా సేపు పరిస్థితి అలాగే కొనసాగింది. వీడియో చివరిలో ఓ మహిళ, మరో వ్యక్తి కూడా లేచి వాగ్వాదానికి దిగడం కనిపించింది.
ఈ వీడియోను ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీంతో అది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలను ఓ యూజర్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ‘‘2 పాక్స్ 22 ఏ వ్యక్తి, 23 ఏ అమ్మాయి ఆమె భోజనం చేస్తోంది. అలాగే 22ఏ సీటును తన కాళ్లతో తన్నడం మొదలుపెట్టింది. ఆ సమయంలో 22ఏ పాక్స్ లో కూర్చున్న వ్యక్తి నిద్రపోతున్నాడు. దీంతో బాలిక చర్యలతో అతడికి మెలుకువ వచ్చింది. మీకు మార్యదలు లేవా అని గట్టిగా అరిచాడు. దీంతో బాలిక తండ్రి ఆగ్రహానికి గురై అతడిని కొట్టేందుకు సిద్ధపడి గట్టిగా అరవడం ప్రారంభించారు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
