బెంగళూరు ఇంటర్నేషన్ లో ఎయిర్ పోర్టు రోడ్డులో ఆగి ఉన్న ఓ వాహనాన్ని తనిఖీ చేసేందుకు కానిస్టేబుల్ వెళ్లారు. ఆయన డ్రైవర్ తో మాట్లాడుతుండగా.. ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.
కర్ణాటకలో దారుణం జరిగింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో ఆగి ఉన్న వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ ను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. మృతుడిని దేవనహళ్లి పోలీస్ స్టేషన్ కు చెందిన సురేష్ గా గుర్తించారు.
పార్టీలోకి తిరిగి రండి - రెబల్ ఎమ్మెల్యేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైవేపై ఓ కారు టైరు పగిలిపోయి ఉండటంతో ఆ వాహనం అక్కడే ఆగిపోయింది. దీంతో దానిని తనిఖీ చేసేందుకు, ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆయన అక్కడికి వెళ్లాడు. కారు డ్రైవర్ తో విచారణ జరుపుతుండగా అదే రోడ్డుపై వేగంగా వచ్చిన మరో కారు సురేష్ ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.
ఘోరం.. ఐదేళ్ల కుమారుడిని చంపి, భార్య కూతుర్లపై దాడి చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి.. ఎందుకంటే ?
అలాగే కానిస్టేబుల్ విచారిస్తున్న మరో వాహన డ్రైవర్ కాళ్లు, చేతులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అదే కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ముగ్గురు బాలికలు మద్యం మత్తులో ఉన్నారు. ఈ ఘటనలో అందరికీ గాయాలయ్యాయి. సురేష్ నైట్ డ్యూటీలో ఉన్నాడని, పోలీస్ ఇన్స్పెక్టర్ ధర్మే గౌడతో కలిసి తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.
రూ.50 లక్షల విలువైన డైమండ్ రింగ్ చోరీ.. దొరికిపోతాననే భయంతో టాయిలెట్ సీటులో పారేసిన యువతి..
అయితే సురేష్ పోలీసు కారు నడుపుతుండగా.. హైవేపై ఓ ఇన్నోవా కారు ఆగి ఉండటాన్ని గమనించాడని చెప్పారు. కానిస్టేబుల్ తన వాహనాన్ని ఆపి, ఆ ఇన్నోవాను తనిఖీ చేయడానికి చేయడానికి వెళ్లాడని తెలిపారు. ఆ కారు డ్రైవర్ తో మాట్లాడుతుండగా.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కానిస్టేబుల్ తో పాటు ఉన్న ఇన్ స్పెక్టర్ ఫోన్ కాల్ కు సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆగి ఉన్న కారు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
