తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు యాత్రికులు చనిపోయారు. 40 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తంజావూరు జిల్లాలో ఆదివారం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు యాత్రికులు మరణించారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. వీరంతా త్రిస్సూర్ నుంచి వేలంకన్ని చర్చికి యాత్ర కోసం వెళ్తున్నారు. ఇందులో ఉన్న నలబై మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

కాంగ్రెస్ ఫైల్స్: బీజేపీ వీడియో క్యాంపెయిన్.. కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు తీవ్రతరం

వివరాలు ఇలా ఉన్నాయి. త్రిసూర్‌లోని ఒల్లూరు గ్రామానికి చెందిన 51 మంది (పిల్లలు, పెద్దలు కలిపి) భక్తులు కేవీ ట్రావెల్స్ చెందిన బస్సులో శనివారం సాయంత్రం 7 గంటలకు వేలంకన్నికి బయలుదేరారు. వీరంతా వేలంకణిలో ఉన్న ప్రసిద్ధ చర్చిలో ఆదివారం నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొనాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ బస్సు ఉదయం తంజావూరుకు చేరుకునే సరికి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఈ ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. మరణించిన వారిలో ఇద్దరిని 55 ఏళ్ల లిల్లీ, ఎనిమిదేళ్ల జెరాల్డ్‌గా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. 40 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అతడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదం.. సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్ బెళగల్లు వీరన్న దుర్మరణం..

ఇలాంటి ఘటనే గత నెల 19వ తేదీన జ‌మ్మూకాశ్మీర్ లో జరిగింది. పుల్వామా జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బీహార్ కు చెందిన నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని బర్సూ ప్రాంతంలోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్ర‌మాదం గురించి స‌మాచారం అంద‌డంతో బీహార్ ప్ర‌భుత్వం మృతుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటాని తెలిపింది. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.

ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ మృతికి సంతాపం: జ్ఞాపకాలను నెమరేసుకున్న మోడీ

శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో కూడా ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. హౌరా నుంచి కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌కు ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు మాయో రోడ్-డఫెరిన్ రోడ్ క్రాసింగ్ వైపు వెళ్తున్న సమయంలో అదుపుతప్పింది. దీంతో బస్సులో ఉన్న మరో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరణించిన ఒకరిని అజ్లాన్ ఖాన్ గా గుర్తించారు.