Asianet News TeluguAsianet News Telugu

అజంగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు

ఓ బైక్ ను బస్సు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన యూపీలోని అజంగఢ్ లో చోటు చేసుకుంది. 

Fatal road accident in Azamgarh.. Bike collided with bus, fire broke out.. Two killed.. Six injured
Author
First Published Nov 21, 2022, 3:34 PM IST

యూపీలోని అజంగఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు అంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

మోర్బీ వంతెన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

వివరాలు ఇలా ఉన్నాయి. అజంగఢ్ జిల్లాలోని లోహ్రా గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సు.. బైక్ పైకి దూసుకెళ్లింది. దీంతో బైక్ ను బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ రాపిడి వల్ల బస్సు దగ్ధం అయ్యింది. ఈ మంటల వల్ల ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయలు అయాయి. మృతులను బద్సర ఐమా గ్రామానికి చెందిన రవీంద్ర, పింటుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్ కు పంపించామని పేర్కొన్నారు. క్షతగాత్రులను అట్రాలియాలోని హాస్పిటల్ ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం ఆజంగఢ్‌లోని ఫుల్‌పూర్ కొత్వాలి ప్రాంతంలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి పొలంలోకి వెళ్లింది. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై భార్య రేప్ కేసు.. ‘ఆమె రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నది’

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. అక్కడ మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఫుల్‌పూర్ కొత్వాలిలోని సదర్‌పూర్ బరౌలీ గ్రామానికి చెందిన ఫిరోజ్ (18), నియాజ్ గ్రామానికి చెందిన ఉమర్ (20), నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లోని తోవాన్ గ్రామానికి చెందిన వకాష్ (21) ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. 

శనివారం ఉదయం ముగ్గురూ కోచింగ్ కోసం షాగంజ్ వైపు కారులో వెళ్తున్నారు. అయితే సుద్నీపూర్ గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని పొలంలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ప్రమాదానికి గురైన కారులో ఉన్న ముగ్గురిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ వకాష్ మృతి చెందాడు.సమాచారం అందుకున్న ఫుల్‌పూర్ కొత్వాలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

తమిళనాడును వణికిస్తున్న ‘‘మద్రాస్ ఐ’’.. మధురైలో భారీగా కేసులు..

కాగా.. బలరాంపూర్ కొత్వాలిలోని ఉక్రుడా సిక్స్ లేన్ సమీపంలో శనివారం ఉదయం ఓ ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రైడర్ అన్షికా సింగ్ (6), సీతారాం (26), ఇస్రా పోలీస్ స్టేషన్ కొత్వాలి జియాన్‌పూర్‌లో నివాసం ఉంటున్న సుబేదార్ (24), ఇటౌరా చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సతేంద్ర (25) కొత్వాలి మహ్మదద్ జిల్లా మౌ గాయపడ్డారు. నలుగురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios