Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడును వణికిస్తున్న ‘‘మద్రాస్ ఐ’’.. మధురైలో భారీగా కేసులు..

తమిళనాడు ప్రజలను మద్రాస్ ఐ (కండ్లకలక) అంటువ్యాధి వణిస్తోంది. పిల్లలతో పాటు, ఇతర వయసుల వారికి వ్యాధి సోకుతుంది. తమిళనాడులోని మధురైలో ఈ రకమైన కేసులు భారీగా నమోదవుతున్నాయి. 

Madras Eye cases increase in Tamil Nadu Madurai
Author
First Published Nov 21, 2022, 1:58 PM IST

తమిళనాడు ప్రజలను మద్రాస్ ఐ (కండ్లకలక) అంటువ్యాధి వణిస్తోంది. పిల్లలతో పాటు, ఇతర వయసుల వారికి వ్యాధి సోకుతుంది. తమిళనాడులోని మధురైలో ఈ రకమైన కేసులు భారీగా నమోదవుతున్నాయి. తేమ, చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రోజుకు సుమారు 30 మంది ఔట్ పేషెంట్లు కండ్లకలకతో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి నేత్రవైద్య విభాగం అధిపతి విజయ షణ్ముగం తెలిపారు. ‘‘కంటిలోని తెల్లటి భాగంలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల అంటువ్యాధి వైరస్ వస్తుంది. ఒక వ్యక్తి సోకిన వ్యక్తితో లేదా సోకిన కంటి నుండి విడుదలయ్యే అతని ద్రవంతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఇది త్వరగా వ్యాపిస్తుంది’’ అని చెప్పారు. 

ఇక, కంటి వాపు, ఎర్రబారడం ఈ వ్యాధి లక్షణాల అని వైద్యులు చెబుతున్నారు. తేలికపాటి నొప్పితో వ్యాధి సోకినవారు చికాకుకు లోనవుతున్నారని తెలిపారు. అయితే భయాందోళనలు అవసరం లేదని చెప్పారు. మూడు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయని తెలిపారు. వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు కళ్లకు ముదురు అద్దాలు ధరించవచ్చు లేదా కోల్డ్ కంప్రెస్‌లను ఉంచాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను నివారించాలని వైద్యలు సూచించారు. పాఠశాల పిల్లల్లో కండ్లకలక సులువుగా వ్యాపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 

అరవింద్ కంటి ఆస్పత్రిలో రోజుకు 200 నుంచి 250 కండ్లకలక కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. సాధారణంగా చెదురుమదురు కేసులు వస్తుంటాయి కానీ..  ఈ వర్షాకాలంలో తాము కేసులలో ఊహించని పెరుగుదలను చూస్తున్నామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios