Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై భార్య రేప్ కేసు.. ‘ఆమె రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నది’

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త రేప్ చేశాడని, గృహ హింసకు గురి చేశాడని కేసు పెట్టింది. కాగా, ఈ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే తన భార్య బ్లాక్ మెయిల్ చేస్తున్నదని, రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నదని అన్నారు.
 

rape case against congress mla Umang Singhar by wife, mla says demanding 10 crores
Author
First Published Nov 21, 2022, 3:05 PM IST

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ పై ఆయన భార్యనే రేప్ కేసు పెట్టింది. అత్యాచారం, గృహ హింస ఆరోపణలతో కేసు పెట్టింది. అంతేకాదు, అసహజ శృంగారం, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలతోనే ఆయన సొంత జిల్లా ధర్‌లో కేసు నమోదైంది. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్ తోసిపుచ్చారు.

రేప్ కేసుతోపాటు తన భర్తపై సంచలన ఆరోపణలనూ ఆమె చేసింది. ఆయన తమ ఆస్తులు కొన్నింటిని ఇంటి పని మనిషి భర్త పేరిట చేశారని ఆరోపించింది. గతంలో ఆయన లివ్ ఇన్ పార్ట్‌నర్ అయిన సోనియా భరద్వాజ్‌ ఆత్మహత్యలో ఆయన ప్రమేయం ఉన్నదని పేర్కొంది. ఈ ఆరోపణలపై భోపాల్‌లో గతేడాది కేసు నమోదైంది. కాగా, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే సింఘార్ ఖండించారు. తన భర్యనే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అన్నారు. ఆమె తన దగ్గర నుంచి రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నదని ప్రత్యారోపణలు చేశారు.

Also Read: కదులుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్, మహిళతో సహా నలుగురి అరెస్ట్..

‘నవంబర్ 2వ తేదీన ఆమె పై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆమె నన్ను మెంటల్‌గా హరాస్ చేస్తున్నది. బ్లాక్ మెయిల్ చేస్తున్నది. నా పై తప్పుడు ఆరోపణలతో కేసు పెడతా అని బెదిరించింది. అంతేకాదు, రూ. 10 కోట్లు డిమాండ్ చేసింది. ఈ విషయాలపై ఇప్పుడు ఓ కేసు నమోదైంది’ అని ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ తెలిపారు.

ఉమాంగ్ సింఘార్ బలమైన ట్రైబల్ పొలిటీషియన్. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం జమునా దేవికి దగ్గరి బంధువు. కమల్ నాథ్ ప్రభుత్వంలో ఈయన అటవీ శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం గాంధ్వాని సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  2019లో ఆయన కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవల్లో సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios