సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆయన ప్రత్యేకంగా ఓ పార్టీ పెడతారా..? లేదంటే ఏదైనా పార్టీలో చేరతారా అనే విషయంపై ఎంతో కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  ఈ విషయంపై రజినీ కూడా చాలాసార్లు తన అభిమానులతో సమావేశమై చర్యలు జరిపారు. ఒకానొక సమయంలో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి.

Also Read డిల్లీ అల్లర్లు... బిజెపి ప్రభుత్వంపై రజనీకాంత్ సీరియస్...

అయితే... తాజాగా ఈ విషయంలో రజినీ కాంత్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపే( గురువారం) ఆయన అధికారికంగా తాను పెట్టబోయే పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆయన రజినీ మక్కల్ మండ్రమ్ డిస్ట్రిక్ సెక్రెటరీలతో సమావేశమయ్యారు. రేపు మరోసారి సమావేశమై.. పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... రజినీ కాంత్ ఇప్పటినుంచే ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ పేరు ప్రకటిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పటికే తమిళనాడులో అధికారం కోసం ఎఐఏడీఎంకే, డీఎంకే  లు తలపడుతున్ననాయి.

పళని స్వామి, పన్నీరు సెల్వం లమధ్య ఎప్పటి నుంచో అధికారం కోసం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అధికారం కోసం స్టాలిన్ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ పోటీ నుంచి రజినీ పెట్టబోయే పార్టీ ఎలా తట్టుకుంటుందో చూడాలి.