Asianet News TeluguAsianet News Telugu

గుండెపోటుతో ప్ర‌ముఖ ఒడియా గాయ‌కుడు మురళీ మహాపాత్ర మృతి.. స్టేజీపై పాట పాడుతుండ‌గా ఘ‌ట‌న

అక్షయ మొహంతి ఆఫ్ జైపూర్ గా పేరు గాంచిన ప్రముఖ ఒడియా మురళీ మహాపాత్ర చనిపోయారు. దుర్గాపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. 

Famous Odia singer Murali Mahapatra died of heart attack.. The incident happened while he was singing on stage
Author
First Published Oct 4, 2022, 2:54 PM IST

ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మహాపాత్ర మృతి చెందారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఆదివారం సాయ‌త్రం జరిగిన దుర్గాపూజ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న ఒక్క సారిగా కుప్ప‌కూలిపోయాడు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాపాత్ర, జెయోర్ పట్టణంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స్టేజీపై నాలుగు పాటలు పాడారు. అనంత‌రం ఒక్క సారిగా గుండెపోటు సంభ‌వించింది. దీంతో ఆయ‌న ఆక‌స్మాత్తుగా కుర్చీలో కూల‌బ‌డిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ ఆయ‌న అప్ప‌టికీ మృతి చెందినట్లు డాక్ట‌ర్లు తెలిపారు.

ప్రధాని మోడీ దసరా వేడుకలు ఎక్కడ జరుపుకుంటున్నారంటే?

మురళీ మహాపాత్ర ఆదివారం రాత్రి గుండెపోటుతో చెందాడ‌ని ఆయ‌న సోద‌రుడు బిభూతి ప్రసాద్ మహాపాత్ర ప్ర‌క‌టించారు. మహాపాత్ర మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. ‘‘ప్రముఖ గాయకుడు మురళీ మహాపాత్ర మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన మధురమైన స్వర౦ ఎప్పుడూ శ్రోతల హృదయాలను రగిల్చిస్తు౦ది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను ’’ అని పట్నాయక్ ఒడియాలో ట్వీట్ చేశారు.

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకుపోయిన 28 మంది పర్వతారోహకులు.. పలువురు మృతి

మహాపాత్ర జైపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా కూడా ప‌ని చేస్తున్నారు. మ‌రో తొమ్మిది నెల‌ల్లో ఆయ‌న త‌న స‌ర్వీస్ నుంచి రిటైర్ కావాల్సి ఉంది. మహాపాత్ర లెజండరీ ఒడియా గాయని, గేయ రచయిత, స్వరకర్త అక్షయ మొహంతి గాన శైలిని అనుసరించేవారు. అందుకే ప్రజలు ఆయ‌న‌ను ‘‘ అక్షయ మొహంతి ఆఫ్ జైపూర్’’ అని వర్ణించేవారు.

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఓ సింగర్ ఇలా స్టేజీపై ప్రదర్శన ఇస్తుండ‌గా ఆక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ప‌లు భాష‌ల్లో అద్భుత‌మైన పాట‌ల‌ను అందించిన సింగ‌ర్ కేకే కోల్ కతాలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో పాట పాడుతుండ‌గా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. హాస్పిటల్ కు తీసుకువెళ్లిన వెంటనే ఆయ‌న మృతి చెందార‌ని డాక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios