చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ.. ‘‘కలవడానికెందుకురా తొందరా ’’ అంటూ మంత్రి అంబటి సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం భేటీ అయ్యారు. ఈ భేటీపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగస్త్రాలు సంధించారు. 

Chandrababu Naidu, Pawan Kalyan meet.. Minister Ambati Rambabu's satirical tweet..ISR

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. కలవడానికి ఎందుకు అంతగా తొందర పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు.

హన్మకొండలో ఘోరం.. ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన వివాహిత.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని..

ఆ ట్వీట్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్ ఉద్దేశించి వ్యంగస్త్రాలు సంధించారు. ‘‘కలవడానికెందుకురా  తొందరా ! ఎదర బ్రతుకంతా చిందర వందర !! ’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆయన ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఇరు పార్టీల నాయకులు గతంలోనూ భేటి అయ్యారు. అయితే తాజాగా శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

ఇందులో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించారని సమాచారం. వీరి భేటీ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో పవన్ సమావేశం కావడం ఇది మూడోసారి. ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో పవన్ ఆయనకు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios