Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అరుణ్ బాలి క‌న్నుమూత‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి చనిపోయారు. ఆయన హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగు, పంజాబీ సినిమాల్లోనూ నటించారు. సీరియల్స్ లోనూ పలు పాత్రలు పోషించారు. 

Famous Bollywood actor Arun Bali passed away
Author
First Published Oct 7, 2022, 11:45 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి (79) ముంబైలో కన్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా నాడీ కండరాల సమస్య అయిన మస్తీనియా గ్రావిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం మొద‌ట్లో ఆయ‌న ముంబైలోని హీరానందని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంత‌రం ఇంటికి తిరిగి వ‌చ్చారు. 

ఫ్లిప్ కార్ట్ చేసిన తప్పుకు ఎగిరి గంతేసిన కస్టమర్.. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే.. వచ్చింది చూసి.....

1942 డిసెంబర్ 23వ తేదీన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించిన అరుణ్ బాలి హిందీలోనే కాకుండా, తెలుగు, పంజాబీ సినిమాల్లో కూడా న‌టించారు. త‌న నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయడానికి ముందు ఆయ‌న అనేక టీవీ షోలలో కనిపించారు. అరుణ్ బాలి 1989లో 'దూస్రా కేవల్స‌తో టెలివిజ‌న్ రంగంలోకి ప్ర‌వేశించారు. అదే ఏడాది ఆయ‌న ఫిర్ వాహీ తలాష్‌లో కూడా కనిపించారు. ప్రముఖ టీవీ షో నీమ్ కా పెడ్‌లో ఆయ‌న పాత్ర చాలా ప్రశంసలు అందుకుంది. 

ఢిల్లీలో దారుణం.. బాలిక‌ను స్కూల్ వాష్‌రూమ్‌లో బంధించి గ్యాంగ్ రేప్.. ఘ‌ట‌న‌పై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్

1991లో ఆయ‌న చాణక్య అనే సీరియల్‌లో కింగ్ పోరస్ పాత్రను పోషించారు. దూరదర్శన్ లో చాలా ప్రజాదరణ పొందిన షో స్వాభిమాన్‌లో కున్వర్ సింగ్ పాత్రలో న‌టించారు. ఆయ‌న హే రామ్, కుంకుమ్, మేరే జీవన్ సాథీ, బర్ఫీ, పీకే వంటి సినిమాల్లో కూడా పాత్ర‌లు పోషించారు. 

అరుణ్ బాలి 3 ఇడియట్స్ సినిమాల్లో కూడా అతిధి పాత్రలో క‌నిపించారు. ఆయ‌న ఆ సినిమాలో ప్రముఖ పాత్ర శ్యామలదాస్ చంచద్‌గా న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ల మూవీ  లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్-మానుషి చిల్లర్ ల సామ్రాట్ పృథ్వీరాజ్ లో చివ‌రి సారిగా నటించారు.

షాకింగ్.. యజమానురాలిని బెదిరించి, యేడాదిగా కారు డ్రైవర్ అత్యాచారం..! 

కాగా.. ఏడాది మొద‌ట్లో హాస్పిట‌ల్  నుంచి డిశ్చార్జ్ అయిన తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉంద‌ని ఆయ‌న కుమారుడు అంకుష్ బాలి అప్పట్లో మీడియాకు తెలియ‌జేశారు. కానీ త్వ‌ర‌లోనే మెరుగైన చికిత్స కోసం మ‌ళ్లీ హాస్పిట‌ల్ లో చేరుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కానీ ఈ లోపే ఆయ‌న క‌న్నుమూశారు. ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న మరణానికి కారణం ఏంటనే విష‌యం ఇంకా అధికారికంగా తెలియ‌రాలేదు. కాగా, అరుణ్ బాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు అమెరికాలో నివసిస్తున్నారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు జ‌ర‌గ‌నున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios