Asianet News TeluguAsianet News Telugu

నకిలీ కాల్ సెంటర్ గుట్టు ర‌ట్టు .. ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూల్‌!

 ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని ఈ ముఠా మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. గురుగ్రావ్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు నిర్వాహకులున్నారు. 
 

Fake Call Centre Gang Arrested in Delhi, Cheated Thousands of Unemployed in the Name of Jobs
Author
Hyderabad, First Published Jan 10, 2022, 7:01 AM IST

ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. వేలాది మంది నిరుద్యోగుల నుండి  డ‌బ్బులు దండుకుంటున్న  గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ కేంద్రంగా అక్రమంగా కాల్‌ సెంటర్‌ నడుపుతూ..  దేశ‌వ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ.. దగాకు పాల్పడింది ఢిల్లీ గ్యాంగ్‌. ఈ గ్యాంగ్ ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన రాజేష్‌ సింగ్‌, అనుభవ్‌సింగ్‌, నఫీజ్‌, సైఫ్‌ అలీ, యోగిత, షాలు కుమారి, ప్రియ, శివానీలు ఒక మఠాగా ఏర్పడి.. మయూర్‌ విహార్‌ పేరుతో ఢిల్లీలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

'షైన్‌.కామ్ అనే    వెబ్‌సైట్ల ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ఉద్యోగం కావాలని రిజిస్ట‌ర్ అయిన వారిని టార్గెట్ చేస్తారు.  వెబ్‌సైట్‌ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఇతరత్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాది కాలం నుంచి కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్టు వంద‌లాది మంది నుంచి డబ్బులు వ‌సూల్ చేశారు. 

కానీ.. హైదరాబాద్ అమ్మాయిని మోసం చేసే క్ర‌మంలో దొరికిపోయారు.ఎనిమిది మంది సభ్యులు గ‌ల ముఠాను ఢిల్లీలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ తెలిపారు. ఢిల్లీలో అరెస్టైన ఎనిమిది నిందితుల‌ను హైదరాబాద్ కు తరలించారు. వారి నుంచి 26 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 
 
 వివరాల్లోకెళ్తే.. హైదర్‌గూడకు చెందిన యువతి ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం కావాలంటూ ‘షైన్‌ డాట్‌కామ్‌’లో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేసింది. ఆ రెజ్యూమ్ ఆధారంగా ఆ యువ‌తిని సంప్ర‌దించారు.ఆ ముఠా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. సెక్యురిటీ డిపాజిట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌తోపాటు వివిధ చార్జీల పేరుతో ఆ యువతి నుంచి రూ. 8,02,426 వసూలు చేశారు. అయినా ఉద్యోగం రాలేదు. డబ్బులు అడిగినా వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితురాలు గత ఏడాది అక్టోబర్‌ 10న సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు ఢిల్లీకి చేరుకుని మోసానికి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి 26 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గిఫ్టుల పేరుతో కూడా...ఫ్రెండ్‌షిప్‌కు గుర్తుగా ఖరీదైన గిఫ్టులు పంపిస్తామని మోసానికి పాల్పడే నైజీరియన్లకు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios