ఇంటి పైకప్పుపై పటాకులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఇందులో 10 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరో పేలుడు సంభవించింది. ఇద్దరు మహిళలు ఇంటి పైకప్పుపై బాణాసంచా తయారు చేస్తుండగా ఒక్క సారిగా మంటలు చెలరేగి పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వల్ల ఓ మహిళ, అక్కడే ఉన్న ఓ చిన్నారి చనిపోయారు. ఓ మహిళకు గాయాలు అయ్యాయి. అయితే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది.

నెమలి ఈకలు పీకి, చిత్ర హింసలు పెట్టి చంపిన యువకుడు.. వీడియో తీస్తూ పైశాచికానందం.. సోషల్ మీడియాలో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఓ కాలనీలో అక్రమంగా బాణసంచా తయారు చేసి, నిల్వ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జయశ్రీ ఘాటి (65), మరో మహిళ ఆదివారం రాత్రి సమయంలో తమ ఇంటిపైన పటాకులు తయారు చేస్తున్నారు. అయితే ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఇంటి దగ్గరలో ఉండే 10 ఏళ్ల పంపా ఘాటి అనే బాలిక కూడా గాయపడింది. 

ఈ ఘటనలో పంపా ఘాటి, జయశ్రీ ఘాటి అక్కడికక్కడే చనిపోయారు. గాయాలపాలైన మరో మహిళను స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆమె చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో మరణించింది. కాగా.. ఈ పేలుడు సంభవించిన ప్రాంతం అక్రమ బాణసంచా తయారీకి, గోదాములకు కేంద్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రత నమోదు..

వారంలో రెండో పేలుడు..
పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 12 మంది మృతి చెందిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు గురువారం అరెస్టు చేసిన అక్రమ బాణసంచా తయారీ యూనిట్ యజమాని, ప్రధాన నిందితుడు కాళీపాద అలియాస్ భాను బాగ్ ఒడిశాలోని కటక్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

విషాదం.. బావి శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ముగ్గురు మృతి

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పశ్చిమ బెంగాల్ సీఐడీ ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేసింది. అక్రమ బాణసంచా తయారీ కర్మాగారం గురించి పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. పేలుడుపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.