ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. ఈ విషయాన్ని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 

ఉత్తర కాలిఫోర్నియా తీరంలో ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.5గా నమోదు అయ్యింది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) తెలిపింది.

శ్రీన‌గ‌ర్ లో చారిత్రాత్మ‌క‌ జీ20 సదస్సు.. జ‌మ్మూకాశ్మీర్ లో భద్రత కట్టుదిట్టం

గ్రామీణ హంబోల్ట్ కౌంటీలో సుమారు 1,000 మంది జనాభా ఉన్న పెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్ల (67 మైళ్ళు) దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యుఎస్డీఎస్ పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఉత్తర కాలిఫోర్నియాలోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.

కాలిఫోర్నియాలో భూకంపాలు సర్వసాధారణం. డిసెంబరులో ఉత్తర కాలిఫోర్నియా తీరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 12 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు.

నెమలి ఈకలు పీకి, చిత్ర హింసలు పెట్టి చంపిన యువకుడు.. వీడియో తీస్తూ పైశాచికానందం.. సోషల్ మీడియాలో వైరల్

ఇదిలా ఉండగా... భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 30వ తేదీన భూకంపం వచ్చింది. గత ఆదివారం 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఉదయం 5.15 గంటలకు వచ్చిన ఈ భూకంపం 5 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అక్షాంశం-రేఖాంశాలు వరుసగా 35.06, 74.49గా నివేదించబడ్డాయి. భూకంపం తీవ్రత 4.1 గా రిక్ట‌ర్ స్కేల్ పై న‌మోదైంది. ఐదు కిలో మీట‌ర్ల లోతులో ఈ భూకంపం సంభ‌వించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

మార్కులు తక్కువ వచ్చాయని ఆరేళ్ల చెల్లెని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లి.. కోటి రూపాయిలు కావాలంటూ మెసేజ్..

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.