ఓ యువకుడు నెమలిని చిత్ర హింసలకు గురి చేస్తూ చంపాడు. ఈ దారుణాన్ని వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని కట్నీలో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు, ఫారెస్టు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మధ్యప్రదేశ్‌లోని కట్నీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ పక్షి నెమలిని ఓ యువకుడు చిత్ర హింసలకు గురి చేసి చంపేశాడు. అది ఎగురకుండా దాని ఈకలు పీకేశాడు. ఈ చర్యనంతా అతడు వీడియో కూడా తీశాడు. ఆ యువకుడి పక్కన ఓ బాలిక కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ లోని రితి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అతుల్ అనే యువకుడు ఓ నెమలిపై తన క్రూరత్వాన్ని ప్రవర్శించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియే ప్రకారం.. కనికరం లేకుండా దాని ఈకలు పీకాడు. ఈ సమయంలో అతడి పక్కన ఓ బాలిక కూడా ఉంది. ఈకలు పీకుతున్న సమయంలో పక్క నుంచి హిందీ పాటు ప్లే అవుతున్నాయి. ఈకలు పీకుతూ, నవ్వుతూ ప్లే అవుతున్న పాటల్లో వీరు కూడా శ్రుతి కలిపారు.
విషాదం.. బావి శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ముగ్గురు మృతి
అతుల్ పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేక పాపం ఆ నెమలి మరణించింది. అయితే ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో అతడిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ వీడియో ఫారెస్టు అధికారులకు చేరడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
నెమలిని చిత్రహింసలకు గురి చేసి చంపిన విషయం తమ దృష్టికి వచ్చిందని కట్నీ జిల్లా డీఎఫ్‌ఓ గౌరవ్ శర్మ తెలిపారు. ‘‘ఈ విజువల్స్‌ను గుజరాత్‌కు చెందిన ఎన్‌జీవో మాకు పంపింది. ఈ వీడియోలో కనిపించిన మోటర్‌బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించాం. అతడు రితి ప్రాంతానికి చెందినవాడు. ఈ ఘటనపై అటవీశాఖ, జిల్లా పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. భారతీయ వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972 కింద కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
