ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ కోర్టు తన తీర్పును ప్రకటించింది. అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సేన్ గర్ కు  10 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అత్యాచారం జరిపిన మైనర్ బాలిక తండ్రిని హత్యా చేసిన కేసులో సేన్ గర్ కు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 

ఆయనతోపాటు ఈ కేసులో సహా నిందితుడు అతడి సోదరుడు అతుల్ కి కూడా 10 ఏండ్ల శిక్షను విధించింది. అత్యంత క్రూరంగా నలుగురి పిల్లల తండ్రిని క్షమించరాని నేరమని, ఆ కుటుంబంలో నలుగురు పిల్లల్లో ముగ్గురు మినార్లని, ఆ కుటుంబం ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయిందని కోర్టు చెప్పింది. 

అన్నదమ్ములిద్దరూ బాధిత కుటుంబానికి చెరొక 10లక్షలను నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు తెలిపింది. ఇప్పటికే రేప్ కేసులో జీవిత ఖైదును విధించిన కోర్టు ఆయనకు మరో కేసులో ఈ శిక్షను విధించింది. అత్యాచారం కేసులో ఆయనకు 30 లక్షల జరిమానాను విధించి, దానిని ఆ బాధితురాలికి అందజేయమని ఆదేశించింది. 

Also read: ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

గత ఆగస్టులో ఈ కేసుకు సంబంధించి కోర్టు కుల్దీప్ సేన్ గర్, ఇతరులపై అభియోగాలను నమోదు చేసింది. నాటు తుపాకిని అత్యాచార బాధితురాలి ఇంట్లో ఉంచి ఆ బాధితురాలి తండ్రిపై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా పోలీస్ స్టేషన్ వద్ద ఆయనను తీవ్రంగా కొట్టారు. 

అత్యాచార బాధితురాలు న్యాయం జరగడం లేదని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఈ కేసు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన జరిగినా తరువాతి రోజే బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. అక్రమ మారణాయుధాలు కేసులో అతడిని అరెస్ట్ చేసారు. 

అయితే అత్యాచారం కేసులో కోర్టు తీర్పును బీవినిపిస్తు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో సెంగార్ తన కుమార్తె, సోదరితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన సెంగార్.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని కోర్టు పేర్కొంది.

Also Read: ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

అత్యాచార బాధితురాలిని భయపెట్టే విధంగా సెంగార్ వ్యవహరించారని, ఇందుకు గాను ఆయన జీవితాంతం జైలులో ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. నెలరోజుల్లోగా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది.

Also Read:నిర్భయ మిత్రుడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు

జీవిత ఖైదు మాత్రమే విధించడంపై బాధితురాలి కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల్‌దీప్‌కు మరణశిక్ష విధించి ఉంటే తమకు న్యాయం చేసినట్లని, అయితే తమ కుటుంబానికి ఎలాంటి ముప్పులేదన్న సంతృప్తి మాత్రం మిగిలిందని బాధితురాలి సోదరి పేర్కొంది. సెంగార్ జైలులో ఉన్నంతకాలం తాము బిక్కుబిక్కుమంటూనే ఉన్నామని... ఒకవేళ అతను బయటకొస్తే తమ కుటుంబాన్ని చంపేస్తాడని ఆమె అభిప్రాయపడ్డారు.