ఉన్నావ్ రప్ కేసులో బీజేపీ నుండి బహిష్కరణకు గురైన కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవిత ఖైదును విధిస్తూ ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు తీర్పు వెలుువరించింది. బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడ  కోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.బాధితురాలి కుటుంబబానికి భద్రత కల్పించాలని కూడ కోర్టు ఆదేశించింది.

Also Read:పాలకులు కాదు కీచకులు: అధికారం ముసుగులో మహిళలపై అత్యాచారాలు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నుండి బహిష్కరణకు గురైన కుల్‌దీప్ సెంగార్  బాధితురాలిపై  2017 జూన్ 4వ తేదీన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా కూడ న్యాయం జరగలేదు. బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఈ విషయమై ఆ రాష్ట్రానికి చెందిన ఎస్పీ, బీఎస్పీ లు తీవ్రంగా పోరాటం చేశాయి. ఈ పోరాటంతో బీజేపీ నేతలు గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కుల్దీప్ సెంగార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. బాధితురాలు సుప్రీంకోర్టుకు లేఖ రాసింది.దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. ఈ కేసును సీబీఐ విచారణకు  సుప్రీంకోర్టు ఆదేశించింది.  

బాధితురాలిపై గ్యాంగ్‌రేప్ జరిగినట్టుగా  సీబీఐ కోర్టుకు తెలిపింది. . తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదని సీబీఐ అధికారులు తెలిపారు.  2018 ఏప్రిల్ 9వ తేదీన పోలీస్ కస్టడీలోనే బాధితురాలి తండ్రి చనిపోయినట్లు ఈ సందర్భంగా సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పై హత్యా కేసు నమోదైంది. ఉన్నావ్ బాధితురాలు తండ్రి చావుకి కుల్దీప్ ని కారణం చేస్తూ ఆయనపై హత్యా కేసు నమోదు చేశారు. 

 ఉన్నావ్ అత్యాచార ఘటన, హత్యాయత్నం కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉన్నావ్ అత్యాచారం, హత్యాచార యత్నానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలంటూ నిర్ణయం తీసుకుంది. 

ఉన్నావ్ అత్యాచారం ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. అత్యాచారం అనంతరం జరిగిన పరిణామాలపై సీబీఐ పూర్తి వివరాలు అందజేయాలని కోరింది. 

Also Read:ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన న్యాయస్థానం

ఈ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అనుచరుల నుంచి అత్యాచార బాధితురాలికి, ఆమె బంధువులకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబం సీజే దృష్టికి తీసుకెళ్లింది. బాధితురాలకి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని ఆదేశించింది. 

ఈ కేసులో బీజేపీ నుండి బహిష్కరణకు గురైన కుల్దీప్ సెంగార్ దోషిగా కోర్టు తేల్చింది. శుక్రవారం నాడు కుల్దీప్ సెంగార్ కు జీవిత ఖైదును విధిస్తూ నిర్ణయం తీసుకొంది. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు ప్రయాణీస్తున్న కారు కూడ ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం వెనుక నిందితుడు సెంగార్ హస్తం ఉందని కూడ పోలీసులు గతంలోనే తేల్చారు.