Asianet News TeluguAsianet News Telugu

చైనా సరిహద్దుల్లో రెండు పినాకా రిజిమెంట్లు: మోహరించనున్న భారత్


చైనాతో ఉత్తర సరిహద్దుల వెంట పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ లోని రెజిమెంట్లను మోహరించనున్నారు. 

EXCLUSIVE! Eye on China, Indian Army to raise two more Pinaka regiments along LAC lns
Author
First Published Mar 9, 2024, 10:49 AM IST

న్యూఢిల్లీ: చైనాతో ఉత్తర సరిహద్దుల వెంట దేశీయంగా అభివృద్ది చేసిన  పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌లోని రెండు కొత్త రెజిమెంట్లను  మోహరించనున్నారు.తూర్పు లడఖ్‌లోని ఎల్ఐసీ వద్ద  చైనాతో సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, భారత సైన్యం కోసం పినాక రాకెట్ల ఆరు రెజిమెంట్లను ప్రభుత్వం ఆమోదించింది.ఈ 214 ఎంఎం మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్‌ను ఉత్తర సరిహద్దుల్లో మోహరిస్తారు

also read:కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)

ఈ రెజిమెంట్ల సిబ్బందికి  శిక్షణ ఇస్తున్నారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.  వచ్చే ఆరు మాసాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.పాకిస్తాన్ తో  భారతదేశం పశ్చిమ సరిహద్దును కలిగి ఉంది.  చైనాతో ఉత్తర సరిహద్దును కలిగి ఉంది.  2018లో  రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ ఆరు అదనపు ఫినాకా రెజిమెంట్లకు క్లియరెన్స్ ఇచ్చింది.

2020లో  భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్), టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, లారెన్స్, టూబ్రో సంస్థలతో  భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది.  రూ.2,580 కోట్లతో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది.

also read:మరిది పెళ్లిలో వదిన డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

 2024 నాటికి ఆరు రెజిమెంట్లను పెంచాలని రక్షణ శాఖ భావించింది. అయితే ఇందులో రెండింటిని మాత్రమే పెంచే ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు చెప్పాయి. మిగిలిన వాటిని కొద్దినెలల్లో పూర్తి చేయనున్నారు.

also read:అసోంలో మోడీ టూర్: కజిరంగ నేషనల్ పార్క్‌లో ఏనుగు సవారీ చేసిన ప్రధాని (వీడియో)

ఈ ఆరు పినాక రెజిమెంట్లలో  ఆటోమెటెడ్ గన్ ఎయిమింగ్, పొజిషనింగ్ సిస్టమ్ కూడిన  114 లాంచర్లను కొనుగోలు చేస్తారు. అంతేకాదు 45 కమాండ్ పోస్టులు, బీఎంఈఎల్ నుండి 330 వాహనాలను కొనుగోలు చేయనున్నారు.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ది చేసిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ లను టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ తయారు చేస్తున్నాయి.ప్రతి రెజిమెంట్ లో ఆరు పినాకా లాంచర్ల మూడు బ్యాటరీలున్నాయి. ఒక్కొక్కటి 44 సెకన్ల వ్యవధిలో 40 కి.మీ. పరిధిలో 12 రాకెట్లను ప్రయోగిస్తాయి.

also read:టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు?: సీట్ల సర్దుబాటుపై చర్చలు

సుదూర శ్రేణి రాకెట్ ఆర్టిలరీలో స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ది పినాక భారత సైన్యం మందుగుండు సామాగ్రిలో ప్రధానంగా ఉంటుంది.  పినాక వ్యవస్థ సున్నితమైన ప్రాంతాల్లో క్లిష్టమైన లక్ష్యాలను చేధించడం కోసం  ఉపయోగిస్తారు. నిర్ధేశిత లక్ష్యాలను సమర్ధవంతంగా చేధించనుంది.  తక్కువ సమయంలోనే శత్రువు లక్ష్యాలను చేధించనుందని డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్మేనియా- అజర్ బైజాన్ వివాదం మధ్య భారత్ దేశం ఆర్మేనియాకు రూ. 2 వేల కోల్ల విలువైన నాలుగు పినాకా బ్యాటరీల ఆర్ఢర్ ను డెలీవరీ చేసింది. ఇండోనేషియా, నైజీరియా వంటి అనేక దేశాలు ఈ వ్యవస్థపై ఆసక్తిని వ్యక్తం చేశాయి.

.

Follow Us:
Download App:
  • android
  • ios