Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు?: సీట్ల సర్దుబాటుపై చర్చలు

బీజేపీ అగ్రనేతలతో  చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇవాళ మరోసారి భేటీ కానున్నారు.  పొత్తుల విషయమై ఇవాళ స్పష్టత రానుంది.

TDP-Janasena-BJP alliance for Loksabha Elections  2024 lns
Author
First Published Mar 9, 2024, 8:02 AM IST


విజయవాడ: బీజేపీతో పొత్తు విషయమై  తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఇంకా న్యూఢిల్లీలోనే ఉన్నారు.  శనివారం నాడు  ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.  

also read:లంచం ఇవ్వాల్సిందే: రెవిన్యూ సిబ్బంది లంచం అడిగారని ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో

రెండు రోజుల క్రితం  బీజేపీతో పొత్తుచర్చల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం నాడు అర్ధరాత్రి వరకు  అమిత్ షా, జే.పీ. నడ్డాలతో  చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు చర్చించారు.  శుక్రవారం నాడు బీజేపీ అగ్రనేతలతో  రెండో దఫా చర్చలు జరగాల్సి ఉంది. అయితే బీజేపీ అగ్రనేతలు ఇతరత్రా పనుల కారణంగా శుక్రవారం నాడు చర్చలు జరగలేదు. ఇవాళ  ఉదయం మరోసారి  బీజేపీ అగ్రనేతలతో  చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు చర్చించే అవకాశం ఉందని  సమాచారం. తొలి విడత చర్చల్లో  ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయని  టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ప్రకటించారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయమై మూడు పార్టీల నేతలు చర్చించనున్నారని  అచ్చెన్నాయుడు వివరించారు.

also read:అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి

శనివారం నాడు మూడు పార్టీల నేతల సమావేశం తర్వాత పొత్తు విషయమై  అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.జనసేనకు మూడు పార్లమెంట్, 24 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే  10 పార్లమెంట్ స్థానాలతో పాటు  ఆరు లేదా ఎనిమిది అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతుందని ప్రచారం సాగుతుంది.  అయితే ఐదు లేదా ఆరు ఎంపీ స్థానాలు  ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందని  ప్రచారం సాగుతుంది. ఇవాళ  బీజేపీ అగ్రనేతల సమావేశంలో ఈ విషయమై  మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

also read:గాల్లోనే ఊడిన విమానం టైర్: పైలెట్ ఏం చేశాడంటే?

జనసేనకు  మచిలీపట్టణం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో  పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నరసాపురం, అరకు లోక్ సభ స్థానాలు తమకు ఇవ్వాలని తెలుగుదేశానికి బీజేపీ కోరిందని తెలుస్తుంది. అయితే  ఇవాళ్టి సమావేశంలో ఈ విషయాలన్నింటిపై  స్పష్టత రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios