భరణం ఇవ్వాల్సి వస్తుందని మాజీ భార్య, మామ హత్య...అరెస్ట్...
భరణం ఇవ్వడం భారంగా మారిందని మాజీ భార్యను, అడ్డువచ్చిన మామను హత్య చేశాడో భర్త. చివరికి అరెస్టయ్యాడు.

కర్ణాటక : కోలార్‌లోని శ్రీనివాస్‌పూర్ తాలూకాలోని నంబిహళ్లి గ్రామంలో మంగళవారం 40 ఏళ్ల వ్యక్తి తన మాజీ భార్య, ఆమె తండ్రిని హత్య చేశాడు. నగేష్, రాధ (32)లకు ఏడేళ్ల క్రితం వివాహమై ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వారు ఐదేళ్ల క్రితం విడిపోయారు. నగేష్ రాధకు నెలకు రూ. 8,000 భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
రాధ తన గ్రామంలో దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. నాగేష్ తన రెండవ భార్యతో కలిసి శ్రీనివాస్‌పూర్‌లో కాపురం ఉంటున్నాడు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నగేష్, నెలవారీ భరణం చెల్లించకుండా కేసును ఉపసంహరించుకోవాలని రాధపై ఒత్తిడి తెచ్చాడు. అయితే రాధ తమ కొడుకు బాగోగులు చూసుకోవాల్సిఉందని.. దీనికి తానొక్కతే డబ్బులు సమకూర్చలేదని.. ఉపసంహరణకు నిరాకరించింది.
1965లో 2 గేదెలు, దూడ దొంగతనం కేసు.. 58 ఏళ్ల తరువాత 78 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
దీంతో ఆమె మీద నాగేష్ కోపం పెంచుకున్నాడు. దీంట్లో భాగంగానే మంగళవారం ఆమె దుకాణం సమీపంలోకి వచ్చిన నగేష్ కొడవలితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి, మునియప్ప (60) ఇది గమనించి అడ్డుకోవడానికి వచ్చాడు. దీంతో నాగేష్ అతని మీద కూడా దాడి చేశాడు. ఈ దాడిలో రాధ సోదరితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
వారిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మునియప్ప మృతి చెందాడు. నగేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అతడిని పట్టుకుని, ఓ ఇంట్లో బంధించారు. అయితే, ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేల్చివేస్తానని నాగేష్ బెదిరించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే సకాలంలో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.