మన దేశంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందం. అంటే అన్ని అర్హతలు ఉండి, దేశానికి సేవ చేయాలనుకునే వారు మాత్రమే సైన్యంలో చేరవచ్చు. మిగిలిన పౌరులందరూ తమకు ఇష్టం వచ్చిన ఉద్యోగమో, వ్యాపారమో చేసుకోవచ్చు. కానీ కొన్ని దేశాల్లో పుట్టిన వారందరూ తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సిందే. కొన్నేళ్ల పాటు సేవలందించాల్సిందే. అవి ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.  

ప్ర‌స్తుతం దేశం మొత్తం సైనికుడిపైనే చర్చించుకుంటోంది. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌క‌మే దీనికి కార‌ణం. గ‌త కొన్ని నెల‌లుగా ఈ ప‌థ‌కంపై కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసి ఇటీవ‌ల దీనిని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద సైనికులుగా చేరిన వారు నాలుగేళ్ల పాటు దేశ సేవ చేసి తిరిగి స‌మాజంలోకి రావాల్సి ఉంటుంది. ఇలా వ‌చ్చిన వారికి వివిధ ఉద్యోగాల్లో కోటా ఉంటుందని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ఇవి హింసాత్మ‌కంగా మారుతున్నాయి. ఇలా ఆందోళ‌న చేసే వారికి ప‌లువురు మ‌ద్ద‌తు ఇస్తుంటే, మ‌రి కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఇప్పుడే దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

మ‌న దేశంలో పాత రిక్రూట్ మెంట్ ప‌ద్ద‌తి ద్వారా సైన్యంలో చేరిన వారు సాధార‌ణంగా 15 నుంచి 22 సంవ‌త్స‌రాల మ‌ధ్య (సైనికుడి ర్యాంకు, త‌న వ్య‌క్తిగ‌త ఇష్టం మేర‌కు) సేవ‌లందించి రిటైర్డ్ అయ్యే వారు. వారికి ప్ర‌భుత్వం పెన్ష‌న్ ఇవ్వ‌డంతో పాటు ప‌లు సౌక‌ర్యాల‌ను కల్పిస్తోంది. అయితే ప‌లు దేశాల్లో పుట్టిన వారు త‌ప్ప‌నిస‌రిగా సైన్యంలో చేరి దేశ సేవ‌లందించాల్సి ఉంటుంది. వారికి ప్ర‌భుత్వం త‌రుఫు నుంచి నామ మాత్ర‌పు జీతం మాత్ర‌మే దక్కుతుంది. కొన్నేళ్ల పాటు సైన్యంలో ప‌ని చేసిన వారు బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌రువాత సాధార‌ణ పౌరులుగా జీవించాల్సి ఉంటుంది. అలాంటి దేశాలు ఎన్ని ఉన్నాయి ? అక్క‌డి ప‌రిస్థితులు ఏంటి తెలుసుకుంటే మీరు త‌ప్ప‌కుండా ఆశ్చర్యపోతారు.

రష్యా
రష్యన్ చట్టాల ప్ర‌కారం ఆ దేశంలో పుట్టిన 18 నుండి 27 సంవత్సరాల వయస్సు గల పురుషులకు 12 నెలల పాటు సైనిక సేవ తప్పనిసరి. ఇలా సైనిక సేవ చేసే వారిని హేజింగ్ అని పిలుస్తారు. అయితే వారి మ‌త పరమైన విశ్వాసాలు, న‌మ్మ‌కాలు సైనిక సేవకు విరుద్ధంగా ఉంటే సైనికేతర రూపమైన జాతీయ సేవను ఎంచుకోవడానికి రష్యన్ రాజ్యాంగం అనుమతిస్తుంది. ఎందులోనూ భాగస్వామ్యం కాక‌పోతే జరిమానా భ‌రించ‌డం లేదా జైలు శిక్ష ను అయినా అనుభించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ తో జ‌రుగుతున్న యుద్ధంలోనూ వీరిని ఉప‌యోగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా వీటి నుంచి త‌ప్పించుకునేందుకు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు గల చాలా మంది రష్యన్లు దేశం నుంచి పారిపోతున్నారని ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. 

అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మరిన్ని సడలింపులను ప్రకటించిన కేంద్ర హోం శాఖ..

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా
దక్షిణ కొరియా, ఉత్తర కొరియా గత 72 సంవత్సరాలుగా సాంకేతికంగా యుద్ధంలో ఉన్నాయి. శత్రుత్వం ఫలితంగా రెండు దేశాలు తమ సైన్యాన్ని బలపరిచాయి. ఉత్తర కొరియా ‘సోంగున్’ అని కూడా పిలువబడే మిలిటరీ-ఫస్ట్ పాలసీని అనుసరిస్తుంది, దీని కింద అన్ని వనరులకు మొదట సైన్యం ప్రాధాన్యత ఇవ్సాలి ఉంటుంది. సాధారణంగా ఇక్క‌డ 17-18 సంవత్సరాల వయస్సులో సైనిక సేవలో చేరాల్సి ఉంటుంది. గ‌తంలో పురుషులు అయితే 13 సంవ‌త్స‌రాలు, మ‌హిళ‌లు అయితే 10 సంవ‌త్స‌రాలు ఆర్మీలో సేవ‌లందించాలి. కానీ 2003 నుంచి దీనిని పురుషుల‌కు 10, మ‌హిళ‌లు 7 సంవ‌త్స‌రాల‌కు త‌గ్గించారు. కాగా గతంలో మహిళలకు సైనిక సేవ స్వచ్ఛందంగా ఉండేది. అయితే 2015 నుంచి త‌ప్ప‌న‌సరి చేశారు. 

ఉత్త‌ర‌కొరియా పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో పురుషులు సైన్యంలో 21 నెలలు, నౌకాదళంలో 23 నెలలు, వైమానిక దళంలో 24 నెలలు పనిచేయాలి. పోలీస్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్ కూడా ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. ఒలింపిక్స్ లేదా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారులు ఈ నిర్బంధ సైనిక సేవ నుండి మినహాయింపు పొందవచ్చు.

ఇజ్రాయెల్
1949 ఇజ్రాయెలీ భద్రతా సేవా చట్టం అల్ట్రా-ఆర్థోడాక్స్.. అరబ్ ఇజ్రాయిలీలు మినహా 18 ఏళ్లు నిండిన ఇజ్రాయెల్‌లందరికీ సైనిక సేవను తప్పనిసరి చేసింది. యూదు, డ్రూజ్ లేదా సిర్కాసియన్ మూలానికి చెందిన వారు తప్పనిసరిగా ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్‌లో పనిచేయాలి. సైనిక సేవ కనీస నిడివి పురుషులకు 2 సంవ‌త్స‌రాల 8 నెల‌లు, మహిళలకు 2 సంవ‌త్స‌రాలుగా ఉంది. కాగా ఇజ్రాయెలీ అరబ్బులు, మతపరమైన మహిళలు, వివాహం అయిన వారు, వైద్యపరంగా, మానసికంగా అనర్హులుగా భావించే వారికి తప్పనిసరి సైనిక సేవ నుండి మినహాయింపు ఉంది. 

Agnipath protests: రైల్వేకు రూ. 40 కోట్లకు పైగా నష్టం!

బ్రెజిల్
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం.. ప్రతీ పురుష బ్రెజిలియన్ పౌరుడికి సైనిక సేవ తప్పనిసరి. వారు మిలిటరీలో కనీసం 12 నెలల పాటు సేవ చేయాలి. సాధారణంగా రిక్రూట్‌మెంట్ 18 సంవత్సరాల వయస్సులో జరుగుతుంది. ఇందులో నిరాక‌రిస్తే ఓటు హక్కు లేదా ఎన్నిక‌ల్లో పోటీ చేసే హ‌క్కుతో పాటు రాజకీయప‌ర‌మైన‌ అన్ని హ‌క్కులు తొల‌గించే అవ‌కాశం ఉంది. అయితే ఈ దేశంలో మహిళల‌కు తప్పనిసరి సైనిక సేవ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. 

ఇరాన్
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. 18 ఏళ్లు పైబడిన పురుషులందరూ 18 నుండి 24 నెలల వ‌ర‌కు సైన్యంలో పనిచేయాలి. ఇరాన్‌లోని మహిళలకు నిర్బంధం వర్తించదు. అయితే 60 ఏళ్లు పైబ‌డిన తండ్రి ఉన్న పురుషుడికి మిన‌హాయింపు ఉంటుంది. సైన్యంలో చేర‌డానికి ఇష్ట‌ప‌డ‌నివారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మార్చ‌డంతో పాటు దేశం నుంచి బ‌హిష్క‌రించ‌డంతో పాటు ఇత‌ర పౌర హక్కులను కూడా తొల‌గిస్తారు. 

Agnipath Protests Explained: హింసాత్మక ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయ్? నిరసనకారుల అసంతృప్తి ఏమిటీ?

టర్కీ
ట‌ర్కీలో కూడా నిర్భంధ సైనిక సేవ అమ‌లవుతోంది. అయితే 2019లో టర్కీ పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది నిర్బంధ సైనిక సేవ నిడివిని 12 నెలల నుండి ఆరు నెలలకు తగ్గించింది. తమ సర్వీసును మరో ఆరు నెలలు పొడిగించుకోవాలనుకునే వారికి నిర్ణీత వేత‌నం అందిస్తారు. అయితే సైన్యంలో చేర‌డం ఇష్టం లేని వారు ఒక నెల పాటు సైనిక శిక్ష‌ణ పొందాల్సి ఉంటుంది. మిగిలిన 5 నెల‌ల కాలం ప‌ని చేయ‌కుండా ఉండాలంటే 5 వేల డాల‌ర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. 20 నుంచి 41 సంవత్సరాల వయస్సు గల పురుషులంద‌రికీ నిర్బంధ సైనిక సేవ వర్తిస్తుంది. అయితే ఉన్నత విద్య లేదా వృత్తిపరమైన శిక్షణను అభ్యసిస్తున్న వారు తమ చదువులు పూర్తయ్యే వరకు ఈ సేవను కొంత ఆల‌స్యం చేసుకునే అవ‌కాశం ఉంది. విదేశాల్లో నివసిస్తున్న టర్కిష్ పౌరులు కొంత నిర్దిష్ట రుసుము చెల్లిస్తే నిర్బంధ సైనిక సేవ నుంచి మినహాయింపు ఉంటుంది. 

క్యూబా
క్యూబాలో 17-28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులంద‌రికీ 2 సంవత్సరాల పాటు సైనిక సేవ తప్పనిసరి. మహిళలకు క్రియాశీల సైనిక సేవ స్వచ్ఛందంగా ఉంటుంది. వారు వృత్తిపరమైన సైనికులుగా లేదా మహిళల స్వచ్ఛంద సైనిక సేవలో సభ్యులుగా చేరవచ్చు. ఇక్క‌డ 1 సంవత్సరం పాటు సేవ చేయాల్సి ఉంటుంది. పురుషులు 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు సైనిక సేవ కోసం అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

స్విట్జర్లాండ్
ఈ దేశంలో కూడా పురుషులకు సైనిక సేవ తప్పనిసరి. మ‌హిళ‌ల‌కు స్వ‌చ్చందం. ప్రాథమిక సైనిక సేవ 21 వారాల పాటు కొనసాగుతుంది. అయితే అదనపు శిక్షణా కార్యక్రమాలకు యుక్తవయస్సులో హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం సేవా వ్యవధి ఒక సంవత్సరం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. 2013లో స్విట్జర్లాండ్ నిర్బంధాన్ని రద్దు చేయాలనే లక్ష్యంతో ఒక ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది, అయితే 73 శాతం మంది ఓటర్లు దీనిని వ్య‌తిరేకించారు. దీంతో అది విఫలమైంది. దేశం ఇలా రెఫరెండం నిర్వహించడం ఇది మూడోసారి. కాగా ప్ర‌స్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం 2024 నాటికి మహిళలకు కూడా సైనిక సేవను తప్పనిసరి చేయాలని ఆలోచిస్తోంది.

అగ్నిపథ్ పథకంతో యువతకు కలిగే ప్రయోజనాలివే...: కేంద్ర యువజన మంత్రి రాజ్యవర్ధన్

ఎరిత్రియా
ఈశాన్య ఆఫ్రికన్ దేశం ఎరిట్రియా నిర్బంధానికి ప్రసిద్ధి చెందింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. చాలా మంది ఎరిట్రియన్లు తమ మొత్తం పని జీవితాలను సైనిక లేదా పౌర హోదాలో ప్రభుత్వ సేవలో గడిపారు. 2003 సంవ‌త్స‌రం నుంచి సెకండరీ పాఠశాలను పూర్తి చేయడానికి ముందు ప్రభుత్వం పురుషులు, మ‌హిళ‌ల‌ను సైనిక శిక్షణ పొందాలని బలవంతం చేసింది. ఎరిట్రియన్ చట్టం జాతీయ సేవను 18 నెలలకు పరిమితం చేసినప్పటికీ, అన‌ధికారికంగా సేవ నిరవధికంగా కొనసాగుతుంది. దీని వ‌ల్ల చాలా మంది 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గలవారు సైన్యంలోని జీవితం నుండి తప్పించుకోవడానికి దేశం నుండి పారిపోతారు. 

స్వీడన్
గ‌తంలో స్వీడ‌న్ లో సైనిక సేవ త‌ప్ప‌నిస‌రిగా ఉండేది. 2010 సంవ‌త్సరంలో దానిని తొల‌గించారు. అయితే 2017 సంవ‌త్స‌రంలో ఈ ప్రాంతంలో రష్యా సైనిక కసరత్తుల మధ్య స్వీడన్ సైనిక నిర్బంధాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇది ఇప్పుడు ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది. క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు పెరగడం తిరిగి నిర్బంధాన్ని తీసుకురావడానికి కారణాలుగా చెబుతున్నారు. సైనిక నిర్బంధంలో చేరిన వారు తొమ్మిది నుంచి 12 నెలల వ్యవధిలో పనిచేయాలని భావిస్తున్నారు. కాగా గతంలో పురుషుల‌కు మాత్రమే త‌ప్ప‌ని స‌రిగా ఉన్న ఈ సైనిక సేవ, ఇప్పుడు మహిళల‌కు కూడా వ‌ర్తించ‌నుంది.