మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం చాలా మంది సీబీఐ అధికారులకు కూడా ఇష్టం లేదని, అయినా రాజకీయ ఒత్తిళ్ల వళ్ల తప్పలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులకు సిసోడియా అంతే ఎంతో గౌరవం ఉందని తెలిపారు.
మనీష్ సిసోడియా అరెస్టును చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని, ఈ విషయం వారే తనకు చెప్పారని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కానీ రాజకీయ ఒత్తిడికి వారు లొంగిపోయారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘‘మనీష్ అరెస్టును చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని నాకు చెప్పారు. వారందరికీ ఆయనపై అపారమైన గౌరవం ఉంది. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవు. కానీ ఆయనను అరెస్టు చేయాలని రాజకీయ ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వారు తమ రాజకీయ యజమానులకు విధేయులయ్యారు’’ అని పేర్కొన్నారు.
మోడీకి ఘనస్వాగతం: కర్ణాటక బెళగావిలో ప్రధాని రోడ్ షో
ఢిల్లీలో రద్దయిన మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సిసోడియాను ఆదివారం నాడు సీబీఐ దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించింది. సాయంత్రం సమయంలో ఆయనను అరెస్టు చేసింది. మనీష్ సిసోడియా తాము అడిగిన ప్రశ్నలకు దాటవేత సమాధానాలు ఇవ్వడం, ఆయనకు విరుద్ధంగా సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే దీనిపై ఆదివారమే కేజ్రీవాల్ మండిపడ్డారు. తన డిప్యూటీని సీబీఐ అరెస్టు చేయడం నీచ రాజకీయం విమర్శించారు. ‘‘ మనీష్ అమాయకుడు. ఆయన అరెస్టు నీచ రాజకీయం. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు అన్నీ అర్థం చేసుకున్నారు. దీనికి సమాధానం చెబుతుంది. ఇది మా స్ఫూర్తిని పెంచుతుంది. మా పోరాటం మరింత బలపడుతుంది’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో వ్యాపారవేత్తలు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లిలతో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ గత ఏడాది నవంబర్ 25న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఎక్సైజ్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించిన సిసోడియాను చార్జిషీట్ లో నిందితుడిగా పేర్కొనలేదు.
భార్యకు మెసేజ్ పెట్టి.. హోంగార్డ్ ఆత్మహత్య.. మెసేజ్ లో ఏముందంటే..
మద్యం వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వడానికి ఉద్దేశించిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానం కొంతమంది డీలర్లకు అనుకూలంగా ఉందని, వారు లంచాలు చెల్లించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో నెంబర్ వన్ నిందితుడైన సిసోడియాను అక్టోబర్ 17న మొదటి సారి విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన నివాసం, బ్యాంకు లాకర్లలో కూడా సోదాలు నిర్వహించారు.
