సైనిక సేవలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి వైకల్యం సంభవిస్తే మాత్రమే ఆ సైనికుడు పెన్షన్ కు అర్హుడవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెలవుల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగి వైకల్యం వస్తే పెన్షన్ కు అర్హులు కాదని చెప్పింది. 

సైనిక సేవ వల్ల వైకల్యం ఏర్పడితే లేదా ఆ సేవ ద్వారా వైక‌ల్యం మరింత తీవ్రతరం అయిన‌ప్పుడు మాత్రమే ఆర్మీ సిబ్బంది పెన్ష‌న్ కు అర్హుల‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైకల్యం ప‌రిస్థితి 20 శాతానికి మించి ఉంటే మాత్రమే అది వ‌ర్తిస్తుంద‌ని చెప్పింది. ఆర్మీ సిబ్బందికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తూ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

అడ్డువచ్చిన జంతువును తప్పించబోయి బోల్తా పడ్డ బస్సు, ఒకరు మృతి, 18మందికి గాయాలు

సాయుధ బలగాల సభ్యునికి గాయాలు, సైనిక సేవకు మధ్య సరైన సంబంధం ఉండాలని అదనపు సొలిసిటర్ జనరల్ KM నటరాజ్ చేసిన వాదన‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. సెలవుపై స్టేషన్‌కు చేరిన రెండు రోజుల తర్వాత సైనిక సిబ్బంది గాయపడ్డారనే వాదనను బెంచ్ తోసిపుచ్చుతూ.. ‘‘ సైనిక సేవ వల్ల వైకల్యం సంభవించినా లేదా తీవ్రతరం అయినప్పుడు అది కూడా 20 శాతానికి మించి ఉన్నప్పుడు మాత్రమే పెన్షన్ హక్కు లభిస్తుంది ’’ అని తెలిపింది. 

ప్రస్తుత కేసులో కార్మికుడు సెలవుపై వచ్చిన రెండు రోజుల తర్వాత పబ్లిక్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యాడని కోర్టు గమనించింది. ‘‘ సైనిక సేవకు, ప్రతివాదికి అయిన గాయాలకు మధ్య ఎలాంటి సంబంధ‌మూ లేదు. ’’ అని బెంచ్ పేర్కొంది. మూలాల్లోకి వెళ్లే ఈ అంశాన్ని ట్రిబ్యునల్ పూర్తిగా విస్మరించిందని, అందువల్ల ప్రతివాది వైకల్యం పెన్షన్‌కు అర్హులు కారని చెప్పింది. 

Indo-China Border: భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికుల గ‌ల్లంతు.. ఫురాక్ నదిలో ఒక‌రి మృత‌దేహం ల‌భ్యం

ఈ కేసులో ప్ర‌తివాది జూన్ 4, 1965 న సైన్యంలో చేరారు. 10 సంవత్సరాల‌ 88 రోజులు పనిచేసిన తర్వాత 1975 ఆగస్టు 30వ తేదీ త‌రువాత రిజర్వ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు బదిలీ అయ్యాడు. రిజర్వ్ వ్యవధిలో అతడు 1976 జనవరి 7వ తేదీన డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌లో స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారు. 1999 నవంబర్ 6వ తేదీన అత‌డికి వార్షిక సెలవు మంజూరు అయ్యింది. అయితే సెలవుల్లో రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై స్కూటర్‌ను ఢీకొట్టాడు. మెడికల్ బోర్డు ప్రతివాది వైకల్యాన్ని 80 శాతంగా అంచనా వేసింది. అత‌డిని లో మెడిక‌ల్ కెట‌గిరీలో ఉంచింది. దాని ఆధారంగా ఆయ‌నను 2000 సెప్టెంబర్ 28వ తేదీన ఆర్మీ నుంచి తొల‌గించారు. 

అగ్నిపథ్‌ స్కీమ్‌పై దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు..

దీంతో ఆయ‌న సాయుధ బలగాల ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకొని వికలాంగుల పింఛను అందించాలని వేడుకున్నారు. దీంతో అధీకృత సెలవు కాలంలో ఒక వ్యక్తి గాయపడినట్లయితే, అతడి చర్య సైనిక సేవకు విరుద్ధంగా లేనట్లయితే, అతడి వైకల్యం సైనిక సేవకు ఆపాదించబడుతుందని ట్రిబ్యునల్ పేర్కొంది.