Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్, పాకిస్థాన్ మ్యాచ్.. పంజాబ్ లో జమ్మూకాశ్మీర్, బీహార్ విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ..

పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో ఉన్న లాలా లజపతిరాయ్ కాలేజీలో జమ్మూా కాశ్మీర్, బీహార్ కు చెందిన విద్యార్థుల మధ్య మతపరమైన ఘర్షణ జరిగింది. ఆదివారం జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. 

England Pakistan match.. Fierce clash between Jammu Kashmir and Bihar students in Punjab..
Author
First Published Nov 14, 2022, 9:19 AM IST

ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా పంజాబ్ లోని లాలా లజపతిరాయ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌ కాలేజీలోని విద్యార్థులు మధ్య మతపరమైన భీకర ఘర్షణ జరిగింది. ఫార్మసీ కాలేజీ హాస్టల్‌లో నివసిస్తున్న బీహార్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు రాళ్లు రువ్వుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఏగుగురు గాయపడ్డారు. దీంతో వారికి చికిత్స అందించేందుకు డాక్టర్ మధురదాస్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ పడిన ఈ రెండు గ్రూపుల్లో ముగ్గురు విద్యార్థులు బీహార్‌కు చెందినవారు కాగా మరో ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు.

ఆదివారం పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఘల్లకలన్‌లోని లాలా లజపతిరాయ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లోని ఫార్మసీ కళాశాల హాస్టల్‌ విద్యార్థులు అందరూ కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన వెంటనే హాస్టల్‌లో నివసిస్తున్న బీహార్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు పలు నినాదాలు చేశారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. పరస్పరం దుర్భాషలాడుతూ, కొట్టుకుంటూ, రాళ్లు రువ్వుకున్నారు. 

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఫిట్స్.. ఆటోను ఢీకొన్న బస్సు

అయితే ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు మాట్లాడుతూ.. తాము భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని, పాకిస్తాన్ ఓడిపోయిన వెంటనే బీహార్ విద్యార్థులు ఇస్లాం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దానిని ఆపాలని కోరినప్పుడు తమపై దాడి చేశారని పేర్కొన్నారని ‘జాగరణ్’ నివేదించింది. 

ఈ ఘటనపై స్థానిక ఎస్‌హెచ్‌ఓ జస్వీందర్ సింగ్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ..  తాము హాస్టల్ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం కనిపించిందని తెలిపారు. అయితే అక్కడ విద్యార్థులు ఎలాంటి నినాదాలూ చేసినట్టు తమకు వినబడలేదని చెప్పారు. ఈ ఘర్షణపై జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ జిల్లా ఎస్ఎస్పీతో మాట్లాడింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది.

దీనిపై జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆదివారం సాయంత్రం ఓ ట్వీట్ చేసింది. ‘‘మేము మోగా ఎస్ఎస్పీ గుల్నీత్ ఎస్ ఖురానా జీ మాట్లాడాము. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, కాశ్మీరీ విద్యార్థులతో మోగాలో జరిగిన ఘోర మతపరమైన ఘటన పూర్తి వివరాలు తెలుసుకోవాలని అభ్యర్థించాము. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని, అదుపులోకి తీసుకున్న ఐదుగురు విద్యార్థులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ’’ అని పేర్కొంది.

ఇనుము దొంగిలించారని ఇద్దరిని పోల్‌కు కట్టేసి చితకబాదిని గుంపు.. బిహార్‌లో ఘటన

గతంలో కూడా ఇక్కడ రెండు విద్యార్థి సంఘాలు ఘర్షణ పడింది. దీంతో కాలేజీ యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 200 మంది, బీహార్‌కు చెందిన 125 మంది విద్యార్థులు కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారని కాలేజీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ కృష్ణ కుమార్ కౌడ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios