Asianet News TeluguAsianet News Telugu

ఇనుము దొంగిలించారని ఇద్దరిని పోల్‌కు కట్టేసి చితకబాదిని గుంపు.. బిహార్‌లో ఘటన

బిహార్‌లో ఐరన్ దొంగిలించారని ఇద్దరు వ్యక్తులను కొందరు దారుణంగా కొట్టారు. పోల్‌కు కట్టేసి చితకబాదారు. దీంతో ఒకరు స్పృహ కోల్పోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మూక నుంచి ఆ ఇద్దరినీ రక్షించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు.
 

bihar police rescued to two whome are tied to pole and beaten by a mob for allegedly stealing iron
Author
First Published Nov 14, 2022, 6:20 AM IST

పాట్నా: బిహార్‌లో ఇద్దరు వ్యక్తులను ఓ పోల్‌కు కట్టేసి చితకబాదారు. తీవ్రంగా కొట్టడంతో అందులో ఒకరు స్పృహ ోల్పోయాడు. పోలీసులు ఆ మూక నుంచి ఈ ఇద్దరిని రక్షించాల్సి వచ్చింది. వారిని అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముజఫర్‌పూర్‌లో ఓ యార్డ్ నుంచి ఈ ఇద్దరు బాధితులు ఇనుము దొంగిలించారని ఆ మూక ఆరోపిస్తున్నది.

తాము సకాలంలో స్పాట్‌కు చేరుకున్నామని, వీరిద్దరిని మూక నుంచి రక్షించగలిగామని పోలీసులు తెలిపారు. కానీ, బాధితులను అప్పటికే సుమారు ఒక గంట సేపటి నుంచి దాడి చేస్తున్నట్టు ఇతరులు పేర్కొన్నారు. ముజఫర్‌పూర్ నుంచి స్టీల్ ఐరన్‌ను దొంగిలించారని ఆరోపిస్తున్న వారు కూడా ముజఫర్‌పూర్‌కు చెందినవారేనని పోలీసులు తెలిపారు. వారిని ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.

ముజఫర్‌పూర్‌ సమీపంలో బ్రిడ్జీ దగ్గర ఐరన్ షెడ్లను నిర్మిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత ఒక వారంలో సుమారు ఒక క్వింటాల్ ఐరన్ ఇక్కడి నుంచి చోరీకి గురైందని వివరించారు. 

Also Read: ప్రభుత్వ ఉద్యోగిని స్తంభానికి కట్టేసిన రైతులు.. ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండిపాటు

కొందరు స్థానికులు ఈ ఇద్దరు బాధితులను ఐరన్ దొంగలుగా ఆదివారం మధ్యాహ్నం ఆరోపించారు. వీరే దొంగలు అని చెబుతూ పరుగు మొదలు పెట్టగా బాధితులూ ప్రాణ రక్షణకు పరుగులు తీశారని పోలీసులు వివరించారు. అయితే, ఆ మూక చివరకు సదరు ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. వారిని ఓ పోల్‌కు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios