Asianet News TeluguAsianet News Telugu

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఫిట్స్.. ఆటోను ఢీకొన్న బస్సు

ఢిల్లీలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగానే డ్రైవర్‌కు ఎపిలెప్టిక్ ఫిట్ వచ్చింది. దీంతో బస్సుపై కంట్రోలో కోల్పోయాడు. ఆ బస్సు రాంగ్ డైరెక్షన్‌కు వెళ్లి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ మరణించాడు.
 

bus driver suffers epileptic fit, bus rams autorikshaw
Author
First Published Nov 14, 2022, 6:46 AM IST

న్యూఢిల్లీ: ఓ బస్సు తప్పు దారిలో వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ మరణించాడు. మరొక ప్రయాణికుడు గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని తిస్ హజారీలో చోటుచేసుకుంది. బస్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్‌కు ఎపిలెప్టిక్ ఫిట్ వచ్చినట్టు వివరించారు. దీంతో ఆ వాహనంపై ఆయన నియంత్రణ కోల్పోయాడు.

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సును నడుపుతున్న డ్రైవర్‌కు హఠాత్తుగా ఎపిలెప్టిక్ ఫిట్ వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అందుకే ఆయన బస్సు పై కంట్రోల్ కోల్పోయాడు. ఫలితంగా ఆ బస్సు రోడ్డుపై రాంగ్ సైడ్‌‌కు ఎంటర్ అయింది.  ఎదురుగా వస్తున్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. 

Also Read: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం, డాక్టర్ తో పాటు కుమారుడు మృతి, భార్య,కూతురికి తీవ్రగాయాలు..

49 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ ఈ ఘటనలో మరణించాడు. మరో ఆటో రిక్షా ప్రయాణికుడు గాయాలపాలయ్యాడు. ఓ ఆటోరిక్షా ప్రయాణికుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios