ఢిల్లీ లిక్కర్ స్కాం: అరవింద్ కేజ్రీవాల్‌కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు


న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ  అధికారులు వీడడం లేదు. మరోసారి  అరవింద్ కేజ్రీవాల్ కు  నోటీసులు ఇచ్చారు. 

 Enforcement Directorate  issues 8th summon to Delhi CM  Arvind Kejriwal lns


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు  మంగళవారం నాడు ఈడీ అధికారులు  నోటీసులు పంపారు.  ఈ ఏడాది మార్చి 4వ తేదీన  విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో కోరారు.  లిక్కర్ స్కాంలో  విచారణకు హాజరు కావాలని  అరవింద్ కేజ్రీవాల్ కు  ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఎనిమిదో సారి.

also read:కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక: రోగి పొట్టలో నుండి 39 నాణెలు, 27 ఆయస్కాంతాలు వెలికితీత

ఈ నెల  26న ఈడీ విచారణకు  అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావాలి. కానీ,ఈ విచారణకు  ఆయన హాజరు కాలేదు. దీంతో తాజాగా ఇవాళ మరోసారి కేజ్రీవాల్ కు  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఢిల్లీ  లిక్కర్ స్కాంలో  ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు  అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు.  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని రాజకీయ ప్రేరేపితంగా  అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

also read:రేషన్ కార్డుంటేనే రూ. 500లకు గ్యాస్ సిలిండర్: నిబంధనలు ఇవీ..

నోటీసులిచ్చినా కూడ  అరవింద్ కేజ్రీవాల్  విచారణకు హాజరు కాకుండా పోవడంపై కోర్టును ఈడీ  ఆశ్రయించింది. ఈ విషయమై ఈ నెల  16న  హియరింగ్ జరగనుంది.  సమన్లు చట్ట విరుద్దమని, రాజకీయ ప్రేరేపితమని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. 

also read:గగన్ యాన్‌: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే

 గత ఏడాది నవంబర్  2, డిసెంబర్  22, ఈ ఏడాది జనవరి 3, జనవరి  18, ఫిబ్రవరి 2, 19 తేదీల్లో  ఈడీ అధికారులు  అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు ఇచ్చారు.గత ఏడాది మార్చి  16వ తేదీ వరకు  ఈడీ విచారణకు  అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా  మినహాయింపును  ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల కారణంగా  తాను ఈడీ విచారణకు హాజరు కాలేనని  అరవింద్ కేజ్రీవాల్  కోర్టుకు తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios