Asianet News TeluguAsianet News Telugu

గగన్ యాన్‌: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే

భారత అంతరిక్ష యాత్రలో  పాల్గొనే  వ్యోమగాముల పేర్లను ఇస్రో ఇవాళ వెల్లడించింది. 
 

PM Modi's Mega gaganyaan annoucement:4 astronauts unveiled lns
Author
First Published Feb 27, 2024, 12:38 PM IST

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్ యాన్ లో పాల్గొనే వ్యోమగాములు పేర్లను  ఇస్రో వెల్లడించింది.   ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశ్ సుక్లా లు గగన్ యాన్ లో పాల్గొంటారు.భారత అంతరిక్ష యాత్రలో  పాల్గొనే  వ్యోమగాముల పేర్లను ఇస్రో ఇవాళ వెల్లడించింది. గగన్ యాన్  అంతరిక్షయానం చేసే వ్యోమగాములు  ఇవాళ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.బెంగుళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో వీరంతా కఠినమైన శిక్షణ పొందారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో  ఈ ఘట్టం కీలక మైలురాయిని సూచిస్తుంది.

 

బెంగుళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ ఆఫ్ మెడిసిన్ లో వీరికి  పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత  నలుగురిని ఎంపిక చేశారు.2025లో  గగన్ యాన్ మిషన్ ను  లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది.  గగన్ యాన్ మిషన్ భాగంగా మానవులను అంతరిక్షంలోకి పంపనున్నారు. మూడు రోజుల పాటు భూమి ఉపరితం నుండి 400 కి.మీ. ఎత్తులో ఉన్న కక్ష్యలోకి వ్యోమగాములు వెళ్లనున్నారు.  ఇందు కోసం  ఎల్‌వీఎం3 రాకెట్ ను  వినియోగించనున్నారు. 

 

మూడు రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన తర్వాత నలుగురు వ్యోమగాములు సముద్ర జలాల్లో దిగుతారు. వ్యోమగాములు అంతరిక్షంలోకి ప్రయాణానికి  వీలుగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో పాటు  అత్యవసరంగా  తప్పించుకోవడం,  గగన్ యాన్ లో అవసరమైన టెక్నాలజీపై  వ్యోమగాములకు   శిక్షణ ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios