రేషన్ కార్డుంటేనే రూ. 500లకు గ్యాస్ సిలిండర్: నిబంధనలు ఇవీ..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.ఆరు హామీలను అమలులో భాగంగా ఇవాళ మరో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేయనుంది.
హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఉచితంగా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు జీవోను విడుదల చేసింది.
రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ను ఉచితంగా ఇచ్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకాలు వర్తించనున్నాయి. ప్రతి నెలా గ్యాస్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లించనుంది. ప్రజా పాలనలో ధరఖాస్తు చేసుకున్నవారికే ఈ పథకం వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది.
also read:తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
గత మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ల వినియోగానికి సంబంధించిన డేటాను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.ఈ డేటా ఆధారంగా సబ్సీడీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారుడికి అందించనుంది. గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీని ప్రతి నెల గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించనుంది.
also read:గగన్ యాన్: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే
రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లున్నాయి.పలు గ్యాస్ కంపెనీల నుండి వినియోగదారులు గ్యాస్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వారిలో సుమారు 89 లక్షల మంది వినియోగదారులు తెల్లరేషన్ కార్డులున్నాయి.
also read:కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక: రోగి పొట్టలో నుండి 39 నాణెలు, 27 ఆయస్కాంతాలు వెలికితీత
గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ఇచ్చింది. ఈ ఆరుహామీల్లో భాగంగా రెండు హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసింది. ఇవాళ రెండు హామీలను ప్రారంభించనుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి మిగిలిన హామీలను కూడ అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది.