Asianet News TeluguAsianet News Telugu

ఉద‌య్ పూర్ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని అంతం చేయండి - కాంగ్రెస్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్

టైలర్ కన్హయ్య లాల్ ను హత్య చేసిన వారిని గుర్తించి అంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కోరారు. హంతకులు మానవత్వం అన్ని హద్దులను దాటారని ఆవేదన వ్యక్తం చేశారు. 

End those responsible for Udaipur incident - Congress leader Sachin Pilot
Author
Jaipur, First Published Jun 30, 2022, 12:07 PM IST

రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో జ‌రిగిన టైల‌ర్ హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ నాయ‌కుడు, రాజ‌స్థాన్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాజాగా స్పందించారు. ఈ చ‌ర్య‌కు కార‌ణమైన వ్యక్తులు, సంస్థలను కనుగొని శాశ్వతంగా ముగించాల్సిన అవసరం ఉందని అన్నారు. “ ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారు మానవత్వం  అన్ని హద్దులను దాటారు. ఈ హ‌త్య అంద‌రినీ క‌దిలించింది. వారు ప‌ట్టుబ‌డ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అలాంటి వారికి శిక్ష విధించాలి.’’ అని ఆయ‌న వార్తా సంస్థ ANI కి చెప్పారు.

Maharashtra Political Crisis: శివసేన అధికారం కోసం పుట్టలేదు.. : సంజయ్ రౌత్

జైపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఈ దారుణమైన చర్యను ఖండించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పోలీసులు కొంతమంది వ్యక్తులను పట్టుకున్నారని, టైలర్ హత్యకు కారణమైన వీరిద్దరు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్న‌ట్టు కూడా బయటపడుతున్నాయని పైలట్ తెలిపారు. ‘‘ కాశ్మీర్, పంజాబ్ తో పాటు, రాజస్థాన్ కూడా సరిహద్దు రాష్ట్రమే. సరిహద్దుల వెంబడి లింకులు ఉన్నట్లయితే, మనం దాని దిగువకు చేరుకోవాలి. దీనిని లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.’’ అని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చిన పైలట్, ఈ విషయాన్ని విచారించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే, అధికారి సీనియారిటీతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

మూడు రోజుల కింద‌ట రాజస్థాన్ లోని ఉదయపూర్ నగరానికి చెందిన కన్హయ్య లాల్ ఇటీవ‌ల నూపుర్ శ‌ర్మ కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీనిని పోస్ట్ చేసినందుకు చేసినందుకు ఓ వ‌ర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత‌డి దుకాణంలోకి ప్ర‌వేశించి క్రూరంగా త‌ల‌న‌రికారు. ఈ  భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామ‌ని అందులో వారు చెప్పారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వీడియోలో ఇద్దరు నిందితులు హత్యాయుధాలతో కనిపించడంతోపాటు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ వీడియోలో నిందితులు ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంపేస్తామని హెచ్చ‌రికలు జారీ చేశారు. 

Coronavirus: భారీగా నమోదైన కరోనా వైరస్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు !

ఈ ఘ‌ట‌న‌పై చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 24 గంట‌ల పాటు స‌భ‌లు, స‌మావేశాలు నిషేదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంట‌ర్నెట్ ను నిలిపివేశారు. కాగా కన్హయ్యలాల్ హత్యకు సంబంధించిన వీడియో, హంతకుల వాంగ్మూలం వైరల్ కావడంతో, బీజేపీ నేత కపిల్ మిశ్రా స్పందించారు బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి క్రౌడ్ ఫండింగ్ కు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, “కన్హయ్య లాల్ జీని మతం పేరుతో దారుణంగా హ‌త్య చేశారు. ఈ పరిస్థితిలో మనం వారి కుటుంబాన్ని విడిచిపెట్టలేం. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. రూ. 1 కోటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మొత్తాన్ని నేనే స్వయంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అందజేస్తాను. దీనికోసం మీరంతా మీవంతు విరాళాలు అందించాలని కోరుతున్నాను” అని మాట్లాడారు. దీంతో 24 గంటల్లోనే కోటి రూపాయల విరాళాలు వ‌చ్చాయి. దాత‌లంద‌రికీ కపిల్ మిశ్రా దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios