Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్ గఢ్ లోని సుక్మాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం..

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటలకు నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. వారిద్దరి తలపై రూ.1 లక్ష చొప్పున రివార్డు ఉంది. 

Encounter in Sukma in Chhattisgarh.. Two Naxalites killed..ISR
Author
First Published Sep 5, 2023, 11:47 AM IST

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉన్న ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్మెట్ల, దులేద్ గ్రామాల మధ్య అడవిలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో వివిధ భద్రతా దళాలకు చెందిన జాయింట్ టీమ్ నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. అయితే ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయని పోలీసు అధికారి ఒకరు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో తెలిపారు.

ఆదిత్య-ఎల్1 : రెండో ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మిషన్

తాడ్మెట్ల-దులేద్ గ్రామాల అడవుల్లో మావోయిస్టుల జాగర్గుండ ఏరియా కమిటీకి చెందిన 10-12 మంది సాయుధ కేడర్లు ఉన్నారన్న పక్కా సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 223వ బెటాలియన్ కు చెందిన భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

నాకు కీడు చేసేందుకు భార్య చేతబడి చేస్తోంది.. బెంగళూరులో పోలీసులను ఆశ్రయించిన వ్యాపారవేత్త..

ఈ కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు 12 బోర్ల డబుల్ బ్యారెల్ రైఫిల్, ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరణించిన నక్సలైట్లను మావోయిస్టుల జాగర్గుండ ఏరియా కమిటీలో క్రియాశీలకంగా ఉన్న మిలీషియా కార్యకర్తలు సోధి దేవా, రవా దేవలుగా గుర్తించారు. వారి తలపై లక్ష రూపాయల రివార్డు ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios