జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. 

దక్షిణ కాశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని పద్గంపుర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం తెల్లవారుజామున కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం బేస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

టూరిస్టుగా మారిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు

కాగా.. ఈ కాల్పుల్లో ఉగ్రవాది మృతదేహాన్ని బలగాలు ఇంకా స్వాధీనం చేసుకోలేదని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. మరోవైపు ఈ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు దాక్కున్నట్లు భావిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికలు నాకు చివరివి.. : హెచ్‌డీ కుమార‌స్వామి షాకింగ్ స్టేట్‌మెంట్.. !

పద్గంపుర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో, ఉగ్రవాదులు ప్రతీకార కాల్పులు ప్రారంభించారు.

Scroll to load tweet…

అయితే కాశ్మీరీ పండిట్ బ్యాంక్ గార్డు సంజయ్ శర్మను పుల్వామాలోని అచన్‌లోని అతని ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండు రోజుల తరువాత ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. 2023లో మొదటి సారిగా ఉగ్రవాదుల లక్షిత కాల్పుల్లో సంజయ్ శర్మ అనే కాశ్మీర్ పండిత్ చనిపోయారు. 2022లో ముగ్గురు కాశ్మీరీ పండిట్‌లతో పాటు 18 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.

నాగాలాండ్ లోని అతిపెద్ద మార్కెట్ లో భారీ అగ్నిప్ర‌మాదం.. 200లకు పైగా షాపులు దగ్ధం

ఇదిలా ఉండగా.. గత నెల 17వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. బుద్గాం జిల్లాలోని కోర్టు కాంప్లెక్స్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు.