Kohima: నాగాలాండ్ రాజధాని కోహిమాలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన మావో మార్కెట్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గంటలకు పైగా ఈ ప్రసిద్ధ మార్కెట్ అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
Kohima: నాగాలాండ్ రాజధాని కోహిమాలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన మావో మార్కెట్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గంటలకు పైగా ఈ ప్రసిద్ధ మార్కెట్ అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
నాగాలాండ్ లోని కోహిమాలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన మావో మార్కెట్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిందనీ, ఇంకా మంటలు అదుపులోకి రాలేదనీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది బీఓసీ కోహిమాలో ఉన్న మార్కెట్ కు చేరుకున్నారు. మంటలను ఆదుపుచేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ అగ్నిప్రమాదంలో 200లకు పైగా షాపులు కాలిపోయాయని సమాచారం.
అగ్నిప్రమాద పరిస్థితిని సమీక్షించిన నాగాలాండ్ డీజీపీ రూపిన్ శర్మ మాట్లాడుతూ అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా, మార్కెట్ పక్కనే ఒక ప్రయివేటు ఆస్పత్రి ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఆస్పత్రి రోగులను తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఆస్పత్రి వైపు మంటలు తగ్గుముఖం పట్టగా, మార్కెట్ దక్షిణం వైపు ఎగిసిపడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. భద్రతా దళాలకు చెందిన మరిన్ని అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్టు పేర్కొన్నారు.
